ఇక పోటీలో ఉంది రుద్రమ మాత్రమే

Update: 2015-10-06 05:30 GMT
బాహుబ‌లి సినిమాతో పాటుగా ప్యార‌ల‌ల్‌ గా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చిన సినిమాలు రుద్ర‌మ‌దేవి 3డి - పులి.  ఈ రెండు సినిమాలు ఫిక్ష‌న్ బ్యాక్‌ డ్రాప్‌ - జాన‌ప‌దం - హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమాలుగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక‌దానికొక‌టిగా పోటీ ప‌డే సినిమాలుగా ప్ర‌జ‌ల ముచ్చ‌ట్ల‌లో పాపుల‌ర్ అయ్యాయి.

ఈ మూడు సినిమాల్లో మొద‌ట‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన బాహుబ‌లి దేశంలోని అన్ని రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ త‌న‌కంటూ ఓ స్థానాన్ని సాధించింది. ఆ త‌ర్వాత ఈ రికార్డుల్ని కొట్టే సినిమాగా త‌మిళ చిత్రం పులి పాపుల‌ర్ అయ్యింది. విజ‌య్‌ కి  ఉన్నఅసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌ల్ల పులి బాహుబ‌లిని కొట్టేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌నే అనుకున్నారంతా. కానీ సీను పూర్తిగా రివ‌ర్స‌య్యింది. ఫ‌లితం నెగెటివ్‌ గా వ‌చ్చింది. పులి అటు త‌మిళ బాక్సాఫీస్‌, ఇటు తెలుగు బాక్సాఫీస్ రెండుచోట్లా మ్యాజిక్ చేయ‌డంలో పూర్తిగా త‌డ‌బ‌డింది. హైప్‌ కి త‌గ్గ‌ట్టే సినిమాలో భారీ త‌నం - భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ లేక‌పోవ‌డంతో ఆడియెన్ నిరాశ‌ప‌డ్డారు. నాశిర‌కం విజువ‌ల్స్ ఎవ‌రికీ ఎక్క‌లేదు.

ఇప్పుడు పులి చిత్రానికి సాధ్య‌ప‌డ‌నిది రుద్ర‌మ‌దేవి 3డికి సాధ్య‌ప‌డుతుందా? అన్న చ‌ర్చ సాగుతోంది. రుద్ర‌మ‌దేవి దేశంలోనే తొలి హిస్టారిక‌ల్ 3డి సినిమా అంటూ ప్ర‌చారం చేశారు గుణ‌శేఖ‌ర్‌. రుద్ర‌మ‌దేవి వీర‌త్వం - ఎమోష‌న‌ల్ కంటెంట్ తెలుగు - త‌మిళ ఆడియెన్‌ కి న‌చ్చుతాయ‌నే బ‌లంగా న‌మ్ముతున్నాడు గుణ‌. అందుకే  ట్రైల‌ర్స్‌ లో గ్రాఫిక్స్ వ‌ర్క్‌ పై వ‌చ్చిన కామెంట్లు విన్న త‌ర్వాత ఎంతో జాగ్ర‌త్త ప‌డ్డాడు. విజువ‌ల్ గ్రాఫిక్స్ విష‌యంలో రాజీకి రాకుండా మ‌రింత జాగ్ర‌త్త తీసుకుని క‌రెక్ష‌న్స్ చేసుకున్నాడు. అందుకే బాహుబ‌లి త‌ర్వాత రుద్ర‌మ‌దేవికి మ‌న తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

స‌రైన టైమ్‌ లో గుణ‌శేఖ‌ర్ జాగ్ర‌త్త ప‌డ్డాడు కాబ‌ట్టి... బాహుబ‌లి రికార్డుల్ని రుద్ర‌మ‌దేవి కొట్టేయ‌క‌పోయినా.. క‌నీసం అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే అద్భుత‌మైన ఎమోష‌న్‌ తో ఆక‌ట్టుకుని భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News