అఖిల్ సినిమా రీమేకా?

Update: 2018-12-27 14:46 GMT
మెన్ విల్ బి మెన్.. ఒక మద్యం ఉత్పత్తికి ఇది క్యాప్షన్. దీని కొంచెం మార్చి ‘బాయ్స్ విల్ బి బాయ్స్’ అనే క్యాప్షన్ పెట్టారు అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’కి. ఐతే ఈ క్యాప్షన్ వెనుకే కాదు.. ఈ సినిమా కథకు కూడా స్ఫూర్తి ఉంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ చిత్రం దర్శకుడు వెంకీ అట్లూరి సొంత కథతో తెరకెక్కుతున్నది కాదట. బాలీవుడ్లో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బచ్నా యే హసీనా’ అనే సినిమా ఆధారంగా ‘మిస్టర్ మజ్ను’ను రూపొందిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మిస్టర్ మజ్ను’ ప్రోమోలు చూస్తే ‘బచ్నా యే..’ ఛాయలే కనిపిస్తున్నాయి.

అందులో హీరో పెద్ద ప్లేబాయ్‌. అమ్మాయిలతో సయ్యాటలు ఆడుతుంటాడు. కానీ ఒక అమ్మాయి రాకతో అతడిలో మార్పు వచ్చి మంచివాడిగా మారతాడు. ఈ చిత్రంలో రణబీర్ సరసన దీపికా పదుకొనే, బిపాసా బసు కథానాయికలుగా నటించారు. ఇప్పటిదాకా ‘మిస్టర్ మజ్ను’ ప్రోమోలు చూస్తుంటే రణబీర్ సినిమాకు చాలా దగ్గరగా కనిపిస్తోంది. ‘తొలి ప్రేమ’ సినిమా రిలీజైన రెండు మూడు నెలలకే వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు. రీమేక్ కావడం వల్లే వేగంగా స్క్రిప్టు రెడీ అయిపోయందని.. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి సినిమాను తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు.  ఐతే ‘బచ్నా యే హసీనా’ హిందీలో మరీ గొప్పగా ఏమీ ఆడలేదు. యావరేజ్ అయిందంతే. అలాంటి సినిమాను రీమేక్ చేసి ఎలాంటి ఫలితం రాబడతారో చూడాలి.


Tags:    

Similar News