శృతి కోసం డబ్బులు వదులుకున్నాడా??

Update: 2016-06-09 04:32 GMT
కాదేది రూమర్లను అనర్హం అంటుంటారు సినిమా గాసిప్పులు పుట్టించే రాయుళ్ళు. ఎందుకంటే వారు ఎక్కడి నుండి ఎక్కడికైనా మెలిక వేసేస్తారు మరి. లేటెస్టు రూమర్ ఏంటంటే.. ''ప్రేమమ్‌'' సినిమాలో శృతి హాసన్‌ ను తీసుకోవడం కోసం నిర్మాత దగ్గర డబ్బులు లేకపోతే.. తన రెమ్యూనరేషన్‌ లో నుండి ఏకంగా 50 లక్షలు వదులుకొని.. ఆమెకు పేమెంట్‌ ఇచ్చి పట్టుకొచ్చేలా చేశాడట నాగ చైతన్య. ఇందులో అసలు నిజముందంటారా?

25 కోట్లతో తీద్దాం అంటూ మొదలెట్టిన ''అ..ఆ'' సినిమాకు.. చివరకు 15 కోట్లు ఎక్సెస్ పెట్టేసి.. 40 కోట్లలో సినిమాను పూర్తి చేశాడు నిర్మాత రాధాకృష్ణ. అలాంటి నిర్మాత.. ఇప్పుడు నాగ చైతన్యతో తీస్తున్న ప్రేమమ్‌ సినిమా కోసం.. శృతి హాసన్‌ కు రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదా? ఇవ్వలేకపోయాడా? ఇవ్వకూడదు అనుకున్నాడా? వినడానికే టూ మచ్ గా ఉంది కదూ. పైగా తన స్నేహితుడు కోసం శృతి ఈ సినిమాను చేసిందని అవతల అందరూ చెబుతుంటే.. ఇప్పుడేమో సినిమా ద్వారా తనకు వచ్చే రెమ్యూనరేషన్‌ ను కట్ చేసుకొని మరీ శృతిని దింపాడు అనడం హాస్యాస్పదంగా ఉంది.

నిజానికి మలయాళంలో సాయి పల్లవి చేసిన మలర్ పాత్రను ఇక్కడ శృతి హాసన్‌ చేయడం అనేది పెద్ద ఛాలంజే. పైగా ఈ సినిమా కోసం అమ్మడు అస్సలు గ్లామరస్ లుక్‌ అనేదే పోషించలేదు. లైట్ మేకప్ తో సింపుల్ గా చీరల్లో మెరిసిందంతే. ఇవొక్కటే నిజం.. తతిమావి రూమర్లే!!
Tags:    

Similar News