'బొమ్మరిల్లు' తో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్.. ఇటీవల కాలంలో సినిమాలతో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు హీరోయిన్ అదితి రావ్ హైదరీతో ప్రేమాయణం సాగిస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి.
సిద్ధార్థ్ మరియు అదితి రావు కలిసి "మహా సముద్రం" సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని అంటున్నారు. సినిమా ఫ్లాప్ అయినా మధ్య అనుబంధం బాగా పెరిగిందని.. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవల ముంబైలోని అదితి రావు ఇంటికి సిద్దార్థ్ వెళ్లడం కెమెరా కళ్ళకు చిక్కింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి 'బాయ్స్' సినిమా టైంకే సిద్దార్థ్ కు పెళ్లి అయింది. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో తనతో కలిసి నటించిన శృతి హాసన్ తో డేటింగ్ చేసినట్లుగా రూమర్స్ ఉన్నాయి. కొన్నాళ్లకు ఆమెతో బ్రేకప్ చేసుకున్నట్లుగా టాక్.
ఈ క్రమంలో 'జబర్దస్త్' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత రూత్ ప్రభుతో సిద్దార్థ్ డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి గుడిలో పూజలు కూడా నిర్వహించినట్లు కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారని అందరూ మాట్లాడుకున్నారు.
అక్కినేని నాగచైతన్య తో సమంత విడాకులు ప్రకటించిన సమయంలో సిద్దార్థ్ చేసిన కొన్ని ట్వీట్స్ ఆమెను ఉద్దేశించే అని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. ఇక బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ తో సిద్దూ ప్రేమాయణం సాగించారని బీటౌన్ లో మాట్లాడుకున్నారు. అయితే వీరిలో ఎవరితోనూ ఈ రిలేషన్ ముందుకు వెళ్ళలేదు.
ఇప్పుడు అదితి రావు హైదరితో సిద్దార్థ్ ముంబై వీధుల్లో కలిసి కనిపించడంతో వీరి మధ్య సంబంధం ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి అదితికి 21 ఏళ్ల వయస్సులోనే సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడిని వివాహం చేసుకుంది. అయితే ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఐదేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుంచీ అదితి రావు ఒంటరి జీవితం గడుపుతోంది. ఆమె పై అనేకసార్లు డేటింగ్ రూమర్స్ కూడా వచ్చాయి కానీ.. ఏదీ నిజం కాలేదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ విడాకులు తీసుకున్న సిద్దార్థ్ తో రిలేషన్ షిప్ లో ఉందని టాక్ నడుస్తోంది. అయితే వీరి మధ్య ఉంది స్నేహం మాత్రమే.. 'మహాసముద్రం' సినిమా టైంలో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరిందని మరికొందరు అంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ బ్రేకప్స్ అనేవి మామూలే అని అంటుంటారు. ఈ క్రమంలోనే రోజుకో జంటపై పుకార్లు ప్రచారం చేస్తుంటారు. ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు కలిసి నటించినా.. కలిసి బయట కనిపించినా వారి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని వార్తలు పుట్టిస్తుంటారు.
మరి ఇప్పుడు సిద్దార్థ్ - అదితి మధ్య సంబంధం అలా పుకారు రాయుళ్లు సృష్టించిన గాలి వార్తేనా? లేదా నిజంగానే వారి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందా అనేది తెలియాలంటే ఇంకొన్ని ఆగాల్సిందే.