ఆర్ ఆర్ ఆర్ లో డార్లింగ్ ఎలా వస్తాడు?

Update: 2019-04-13 04:40 GMT
సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ న్యూస్ క్యాస్టింగ్ కు ప్రాధాన్యత పెరిగాక వాస్తవాలకు ఎంత ప్రాచుర్యం లభిస్తోందో పుకార్లకు అంతకు మించిన ప్రచారం దక్కుతోంది. అందులోనూ సినిమాలకు సంబంధించి ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. విషయానికి వస్తే చరణ్ గాయం వల్ల బ్రేక్ తీసుకున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఈ నెలాఖరుకు లేదా మే మొదటి వారం తిరిగి మొదలుపెట్టనున్నారు. ఖచ్చితమైన అప్ డేట్ ఎలాగూ టీం ఇస్తుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు.

తాజాగా ఇందులో డార్లింగ్ ప్రభాస్ చిన్న క్యామియో చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీనికి బలం చేకూరుస్తూ కొన్ని మీడియా వర్గాల్లో సైతం ఇది రావడంతో అభిమానులు నిజమనుకుని చర్చించే అవకాశం ఏర్పడింది .

నిజానికి రాజమౌళికి కాని ప్రభాస్ కాని అలాంటి ఆలోచన ఉండే ఛాన్స్ లేదు. ఐదేళ్ళు బాహుబలి కోసం కలిసి జర్నీ చేశారు. ఒక పక్క సాహోతో మరోపక్క రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీతో చాలా బిజీగా ఉన్న డార్లింగ్ క్యామియో కాదు కదా బయట ఏదైనా వేడుకకు హాజరయ్యే పరిస్థితిలో కూడా లేడు.

రాజమౌళితో ఎంత బాండింగ్ ఉన్నా అతను ఈ రకంగా తన హీరోలను ఎప్పుడూ వాడుకోడు. అందులోనూ ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోనే ఆకాశాన్ని దాటే హైప్ ని తెచ్చేసింది. ఇంకే ఆకర్షణలు మార్కెటింగ్ గిమ్మిక్కులు అవసరం లేదు. అలాంటప్పుడు ప్రభాస్ ను తెచ్చే ఆలోచన ఎవరూ చేయరు. వచ్చే ఏడాది జూలై ని టార్గెట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ట్రేడ్ ఇప్పటినుంచే దాని హక్కుల ప్రయత్నాల్లో ఉంది.
Tags:    

Similar News