ఫోటో స్టొరీ: మళ్ళీ రెచ్చిపోయిన పాయల్

Update: 2019-02-18 05:52 GMT
పోయినేడాది సంచలన విజయం సాధించిన 'RX100' సినిమాతో  తెలుగు తెరకు పరిచయం అయిన హర్యానా అందం పాయల్ రాజ్ పుత్.  మొదటి సినిమాలోనే నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించడమే కాకుండా బోల్డ్ యాక్టింగ్ తో.. ఘాటు లిప్ లాకులతో చెలరేగిపోయింది.  దీంతో అందరి దృష్టిని బాగానే ఆకర్షించింది.  అయినా అది చాలదన్నట్టు సోషల్ మీడియాలో ఘాటు ఫోటో షూట్లతో నెటిజనులపై విరుచుకుపడుతోంది.

ఈ భామ మిస్సా మోర్ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్.  దీంతో సదరు బ్రాండ్ దుస్తులు ధరించి ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను ఎడాపెడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో అప్లోడ్ చేసిపారేసింది. అందమైన మెరూన్ కలర్ టాప్.. జీన్స్ స్కర్ట్ తో సూపర్ డూపర్ పోజులు ఇచ్చింది.  ఫోటోలో మెట్లు.. ఇంటీరియర్స్ గట్రా చూసి మీరు అదేదో పోష్ ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటారేమో. కాదు మహాప్రభో కాదు. అది ముంబై నుంచి గోవా కు వెళ్ళే ఆంగ్రియా క్రూజ్.  అందులో ఆరెక్స్ పాప ఇలా రెచ్చిపోయింది.  లైట్ పింక్ కలర్ లిప్ స్టిక్.. లూజ్ గా వదిలేసిన బ్రౌన్ కలర్ హెయిర్.  వేలికి రింగులు తప్ప మరే ఇతర యాక్సెసరీస్ లేకుండా దర్శనమిచ్చింది. ఇలాంటివి ఎన్ని ఉన్నా.. లేకపోయినా నెటిజనుల దృష్టి మాత్రం ఈ ఘాటు భామ క్లీవేజ్ పైనేనని ప్రత్యేకంగా చెప్పాలా?  

ఇక పాయల్ సినిమాల విషయానికి వస్తే 'వెంకీమామ' లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా.. 'మన్మధుడు-2' నాగార్జునకు జోడీగా నటించే అవకాశాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది.. ఈ ఆఫర్లపై ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఈ సినిమాలు కాకుండా తమిళంలో 'ఏంజెల్' అనే సినిమా చేస్తోంది.


Tags:    

Similar News