వర్మకు భలే కలిసొచ్చిందిగా..

Update: 2016-12-16 09:30 GMT
సూర్య సినిమా ‘ఎస్-3’ ఒకటికి రెండుసార్లు వాయిదా పడింది. ఇది ఆ చిత్రానికి పెద్ద దెబ్బే అనడంలో సందేహం లేదు. సినిమా మీద ఉన్న హైప్ నెమ్మదిగా తగ్గిపోతోంది. ఇలా ఎక్కువ కాలం ప్రేక్షకుల్ని నిరీక్షణలో ఉంచడం ఏమంత మంచిది కాదు. ఐతే ఈ వాయిదాల పర్వంతో ఆ సినిమాకు నష్టం జరగడం మాటేమో కానీ.. వేరే సినిమాలకు మాత్రం బాగానే లాభం జరుగుతోంది. ఈ వారం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి చిన్న సినిమాలు పెద్ద సినిమాల తాకిడి లేకుండా విడుదలవుతున్నాయంటే అందుకు ‘ఎస్-3’ వాయిదా పడటం వల్లే. మరోవైపు ఈ నెల 23 నుంచి కూడా ‘ఎస్-3’ వాయిదా వల్ల ఆ రోజుకు షెడ్యూల్ అయిన వంగవీటి.. సప్తగిరి ఎక్స్‌ ప్రెస్ సినిమాలకు.. ఆ తర్వాతి వారానికి రావాల్సిన సినిమాలకు కలిసొచ్చేదే.

‘ఎస్-3’ వాయిదాతో ఎక్కువ లాభం చేకూరుతోంది రామ్ గోపాల్ వర్మ సినిమా ‘వంగవీటి’కే. ‘ఎస్-3’ రేసు నుంచి తప్పుకోవడంతో వర్మ సినిమాను ఆ వీకెండ్ కు లీడర్ అవుతోంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిన్న సినిమా. విశాల్ మూవీ ‘ఒక్కడొచ్చాడు’ కూడా రిలీజవుతున్నప్పటికీ దాని ప్రభావం వర్మ సినిమా మీద పెద్దగా ఉండదు. ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ‘వంగవీటి’ మీదే ఉంటుంది. టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్శల్ ఫిలిమ్స్ లో ఒకటైన ‘వంగవీటి’ మీద ప్రస్తుతం జనాల్లో బాగానే ఆసక్తి ఉంది. 20వ తేదీన అమితాబ్ బచ్చన్.. నాగార్జున అతిథులుగా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశాడు వర్మ. అదయ్యాక సినిమా మీద మరింత హైప్ రావచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు మాంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News