ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సాహో ఫలితం ఓపెన్ అయిపోయింది. మొదటి మూడు నాలుగు రోజులు హాలిడే సీజన్ వల్ల వసూళ్లు బాగానే వచ్చి 350 కోట్ల దాకా కలెక్ట్ చేసినట్టు యువి వాళ్ళు పోస్టర్లు వేసుకున్నారు కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మంగళవారం నుంచి మొదలైన డ్రాప్ కొనసాగుతోంది. చాలా ఏరియాలలో 80 శాతం దాకా ఫిగర్స్ తగ్గిపోయాయని ట్రేడ్ టాక్.
కానీ దర్శకుడు సుజిత్ మాత్రం సాహో గురించి ఇంకా నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ప్రేక్షకులు సాహోని ఎంతో ప్రేమించారని బీహార్ నుంచి కొందరు ఫోన్ చేసి ఇలాంటి సినిమా తీసినందుకు అక్కడ తాను పుట్టి ఉంటే ఏకంగా గుడి కట్టేసేవాళ్ళమని చెప్పారని మురిసిపోయాడు. నిజంగా అలాంటి కాల్ వచ్చిందో లేదో కానీ బీహార్ నుంచి కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కాల్స్ వచ్చి ఉంటే నిజంగా ఇది సుజిత్ గర్వపడే విజయమే అయ్యుండేది
ఓ లీడింగ్ తెలుగు న్యూస్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుజిత్ అందులో ఈ సంగతి చెప్పుకొచ్చాడు. అయినా నార్త్ ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ ని చూసుకుని మనం మురిసిపోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ రాడ్స్ డిజాస్టర్స్ అని ప్రేక్షకులు తిరస్కరించిన తెలుగు సినిమాలు యుట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో సంచలనం సృష్టించాయి. అంతమాత్రాన వాటిని మనం క్లాసిక్స్ గా తీసుకోలేం.
అందరూ ఆమోదించినప్పుడే దేనికైనా బ్లాక్ బస్టర్ స్టేటస్ వస్తుంది. అంతే తప్ప పక్క రాష్ట్రం నుంచి ఎవరో ఫోన్ చేసి మీకు గుడి కడతాం అన్నంత మాత్రాన సాహోని బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులు ఒప్పుకోలేరు. నిజంగా సుజిత్ చెప్పినట్టు ప్రేక్షకులు బ్రహ్మరధం కడితే ఇంకా మొదటి వారం పూర్తి కాకుండానే కలెక్షన్స్ ఎందుకంత డ్రాప్ అయ్యాయో చెప్తే బాగుంటుంది