మీరు 'యోగి' సినిమా చూశారా? అది.. అది.. 'మున్నా' చూశారా? మరి మొన్న వచ్చిన 'రెబెల్' చూశారా? ఇప్పుడు మధ్య మధ్యలో హాలీవుడ్ లో తయారయ్యే గేమ్స్ తాలూకు టీజర్ బిట్లు కలుపుకుని.. ప్రభాస్ వచ్చి అదే స్టయిల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అదిగో అచ్చం ''సాహో'' తరహాలో ఉంటుంది.
చూస్తుంటే 'బాహుబలి' సినిమా అనేది రాజమౌళి క్రియేషన్ కాబట్టి.. ఈ సినిమా పూర్తవ్వగానే ప్రభాస్ మళ్ళీ యాజిటీజ్ తన పాత షర్టునే వేసుకున్నట్లు ఉన్నాడు. అదేనండీ.. అదే రొటీన్ నాటు కొట్టుడిని బయటకు తీస్తున్నట్లున్నాడు. సాహో టీజర్ లో స్టార్టింగ్ వచ్చిన అండర్ వాటర్ లో అమ్మాయి యానిమేషన్.. ఆ తరువాత చివర్లో ఒక పెద్ద ఆకాశ హర్మ్యం నుండి బాడీ సూట్ ఒకటి వేసుకుని దూకేయడం (చాలా హాలీవుడ్ సినిమాల్లో నుండి మన హృతిక్ క్రిష్ సినిమాల్లో కూడా చూశాంలే) తప్పిస్తే.. అసలు ''సాహో'' టీజర్లో పెద్ద మ్యాటరేం లేదు. ముఖానికి నాలుగు చారల రక్తం.. కట్ చేస్తే ఆ రక్తం వాడిది కాదు మనోళ్ళది అని విలన్ పక్కనున్న ఎవరో చెప్పడం.. ఇదంతా పిచ్చ రొటీన్ మాష్టారూ. ఎన్నాళ్ళని ఇలా హీరో వెళ్ళి మర్డర్లు చేయడానికే పుట్టినట్లు గూండాలను కొట్టేస్తూ ఉంటాడు? తెలుగు సినిమాని అప్డేట్ చేయండి గురూ.
రన్ రాజా రన్ ఫేం సుజిత్ రూపొందిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు యువి క్రియేషన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. టీజర్ వరకు టబ్బీ-ప్యారిక్ అందించిన మ్యూజిక్ బాగుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఎవరో కాని బాగానే కష్టపడ్డారు. తతిమా అంతా నాటు కొట్టుడే.
Full View