'సాహో' ఓవ‌ర్సీస్ స్కైలో?

Update: 2019-03-04 04:06 GMT
2019 మోస్ట్ అవైటెడ్ మూవీగా `సాహో` పేరు మార్మోగిపోతోంది. ఇండియాలో నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు. సుజీత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువి.క్రియేష‌న్స్ సంస్థ దాదాపు 225 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఎలా ఉంది? అంటే తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లో ప్ర‌స్తుతం బేర‌సారాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. `బాహుబ‌లి` సిరీస్ అసాధార‌ణ స‌క్సెస్ నేప‌థ్యంలో `సాహో`కి మేక‌ర్స్ భారీ మొత్తాల్నే కోట్ చేస్తున్నార‌ట‌. ఇదివ‌ర‌కూ సాహో హిందీ శాటిలైట్స్ కి దాదాపు 90 కోట్ల మేర ప‌లికింద‌న్న చ‌ర్చా సాగింది.

`సాహో` ప్రీరిలీజ్ బిజినెస్ విష‌యంలో యు.వీ. క్రియేష‌న్స్‌ సంస్థ ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ట‌. `షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ 1` సంచ‌ల‌నాల త‌ర్వాత అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత టీ సిరీస్ సాహో టీమ్ కి అద్భుత‌మైన‌ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని వార్త‌లొచ్చాయి. సాహో తెలుగు - త‌మిళం - మ‌ల‌యాళం - హిందీ వెర్ష‌న్ల థియేట్రిక‌ల్ రైట్స్ కి గంప‌గుత్త‌గా రూ.240 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఆ ఆఫ‌ర్ ని యువి క్రియేష‌న్స్ సంస్థ రిజెక్ట్ చేసింద‌ని 350 కోట్లు డిమాండ్ చేసింద‌ని వేరొక ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం `షేడ్స్ ఆఫ్ సాహో` మేకింగ్ 2 యూట్యూబ్ - సామాజిక మాధ్య‌మాల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే ఓవ‌ర్సీస్ డీల్ గురించి ముచ్చ‌ట సాగుతోంద‌ట‌.

`సాహో` ఓవ‌ర్సీస్ నిర్మాత‌లు ఎంత డిమాండ్ చేస్తున్నారు? అంటే... అమెరికా స‌హా విదేశాల‌కు సంబంధించి హ‌క్కుల కోసం యు.వి.సంస్థ 45 కోట్లు డిమాండ్ చేస్తోంద‌ట‌. అయితే ఇంత పెద్ద మొత్తం రాబ‌ట్టాలంటే మ‌రోసారి `బాహుబ‌లి` రేంజులో వ‌సూళ్ల దూకుడు ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది. బాహుబ‌లి చిత్రం 10 మిలియ‌న్ డాల‌ర్స్ (70) క్ల‌బ్ లో చేరింది. అంత దూకుడు `సాహో` చూపిస్తేనే అది వ‌ర్క‌వుట‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ప్ర‌ముఖ ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ హ‌క్కుల విష‌య‌మై చ‌ర్చ‌లు సాగిస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే డీల్ కుదిరే వీలుంద‌ని చెబుతున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా ఆగ‌స్టు 15న సాహో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News