తప్పుకున్నందుకు థాంక్స్ చెప్పిన సాహో

Update: 2019-08-06 06:40 GMT
ఇంకో మూడు వారాల్లో సాహో జ్వరంతో తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం ఊగిపోనుంది. యాక్షన్ మూవీస్ లో ఇప్పటిదాకా ఎవరూ ఖర్చు పెట్టని స్థాయిలో సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సాహో ఇంకొద్ది రోజుల్లోనే సెన్సార్ కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో సాహో విడుదలకు సహకరిస్తూ తమ సినిమాలను రీ షెడ్యూల్ చేసుకున్న ఇతర నిర్మాతలకు థాంక్స్ చెబుతూ యూవీ సంస్థ ఒక నోట్ విడుదల చేసింది.

అన్ని భాషల్లోనూ సాహోకు భారీ రిలీజ్ దక్కాలనే ఉద్దేశంతో తమ సినిమాల తేదీలను మార్చుకున్న ప్రతి స్టార్లకు ప్రొడ్యూసర్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీవి కూడా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అందులో పేర్కొంది. ఇలా చెప్పాలన్న రూల్ ఏమి లేనప్పటికి ఓ మంచి సంప్రదాయానికి సాహో టీమ్ శ్రీకారం చుట్టినట్టయింది

నిజానికి సాహో డేట్స్ మారడం వల్ల ఇతర బాషా సినిమాల ప్లానింగ్ గందరగోళంలో పడింది. ఈ తేదీని ముందే లాక్ చేసుకున్న సూర్య కాప్పన్ (తెలుగు బందోబస్త్)ఏకంగా సెప్టెంబర్ 20కి వెళ్ళింది. సాహో హీరొయిన్ శ్రద్ధా కపూర్ నటించిన మరో హిందీ మూవీ చిచోరే కూడా సెప్టెంబర్ 6కు షిఫ్ట్ అయ్యింది. తొలుత వాల్మీకికి ఇదే డేట్ మీద కన్ను వేశాడు. కానీ అన్ని ఆలోచించుకుని సెప్టెంబర్ 13కి మార్చుకున్నాడు.

నాని గ్యాంగ్ లీడర్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయాలి. ముందు 30 అన్నారు కానీ ఇక్కడ సాహో హైప్ చూస్తే పోటీ పడటం అంత సేఫ్ కాదు. సో ఇదీ మారడం ఖాయమే కానీ ఏ డేట్ అనే దాని గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సాహో సోలో రిలీజ్ కు గ్రౌండ్ రెడీ అయ్యింది. ఆగస్ట్ 15 పోటీ ఉండేది కానీ ఇప్పుడు 30కి అలాంటి గండమేదీ లేదు. సో ఓపెనింగ్స్ తో రికార్డులు బద్దలు కొట్టడమే బాకీ

    

Tags:    

Similar News