పాక్ హీరోయిన్ అవమానాల ఆవేదన

Update: 2018-01-18 14:30 GMT
దాయాధి దేశం పాకిస్థాన్ అధిష్టానం పాలన వల్ల ఆ దేశంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పాస్ పోర్టులో పాకిస్థాన్ అని ఉంటే చాలు ఎన్నో అవమానాలను చూడాల్సి వస్తోంది. ఇటీవల ఓ నటి కూడా అదే తరహాలో భరించలేని ఆవేదనకు లోనయ్యిందట. ఆమె ఎవరో కాదు. 2017లో వచ్చిన ‘హిందీ మీడియం’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయిన సాబా ఖమర్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

రూ.23 కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా దాదాపు 100 కోట్ల వరకు రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే.. సభ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా కూడా విమానాశ్రయాల్లో చాలా అవమానాలు జరిగేవట. రీసెంట్ గా పాల్గొన్న ఒక ఈవెంట్ లో ఆమె ఎంతో బావోద్వేగానికి లోనై ఈ విషయాన్ని చెప్పింది. ఆమె మాట్లాడుతూ..షూటింగ్ ల కోసం ఇతర దేశాలకు వెళితే.. నా పాస్ పోర్ట్ చూసి నన్ను మాత్రమే ఎక్కువ సేపు చెక్ చేసేవారు. ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే అనుమనించే వారు.

ఒకసారి జార్జియా వెళ్లినప్పుడు చిత్ర యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ అనుమతించి నా పాస్ పోర్ట్ చూసిన వెంటనే నన్ను ఆపేశారు. చాలా సేపు విచారణ చేసేవారు. అప్పుడు అనిపించింది. పరదేశాల్లో పాకిస్థాన్ కు విలువ ఏ రేంజ్ లో ఉందొ. ఆ ఘటనలు నన్ను మానసికంగా ఎంతో ఆవేదనకు లోనయ్యేలా చేశాయని సాబా వివరించింది.
Tags:    

Similar News