కొన్ని కాంబినేషన్స్ భలే వింతగా అనిపిస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతున్న వీరప్పన్ చిత్రానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో.. హీరో కం ప్రొడ్యూసర్ సచిన్ జోషి కలిసి పని చేయడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వర్మ - సచిన్.. ఈ ఇద్దరూ కూడా 'ఎవరి మాటా వినను' బాపతే. వాళ్లకు నచ్చింది చేయడమే తప్ప.. పక్కనోడి గోల పట్టించుకున్న పాపాన పోరనే టాక్ ఉంది. అలాంటి వీరిద్దరు ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేయడం ఆశ్చర్యకరమే.
'మొదట రాము గారి గురించి చాలా విన్నాను. కానీ కలిసి పని చేయడం మొదలు పెట్టాక నా అభిప్రాయం మార్చుకున్నా' అని సచిన్ జోషి అంటే.. 'నేను చెడ్డవాడినని విన్నాడు. ఇక్కడకి వచ్చాక నేను వరస్ట్ అని అర్ధమైందని చెబుతున్నాడు' అని వర్మ కౌంటర్ వేసేశాడు. నిజానికి వీళ్లిద్దరికీ సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కువే. కానీ దాన్ని రిసీవ్ చేసుకునేందుకు అవతలి వాళ్లకు దమ్ము ఉండాలి.
కిల్లింగ్ వీరప్పన్ చూసి, సచిన్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టామని వర్మ చెబుతున్నాడు. 'కర్నాటక జనాలకు వీరప్పన్ గురించి చాలా తెలుసు. అందుకే అతన్ని ఎలా చంపారనే కాన్సెప్ట్ అక్కడ నచ్చుతుంది. ఇక్కడ వీరప్పన్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈ సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది' అంటున్నాడు సచిన్.