గత కొన్నేళ్లుగా ఇండియాలో స్పోర్ట్స్ బయోపిక్స్ హవా నడుస్తోంది. గత ఏడాది మహేంద్రసింగ్ ధోని మీద తీసిన ‘ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ’ అద్భుతమైన విజయాన్నందుకుంది. రెగ్యులర్ సినిమాల తరహాలో వసూళ్లు రాబట్టింది. దీని తర్వాత జనాల ఫోకస్ మొత్తం సచిన్ సినిమా మీదే ఉంది. సచిన్ జీవిత.. కెరీర్ విశేషాలతో ‘సచిన్ః ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తరహా సినిమా గత ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన టీజర్ క్రికెట్ ప్రియుల్లో భలే ఆసక్తిని రేకెత్తించింది. ఆ తర్వాత వార్తల్లో లేకుండా పోయిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని కన్ఫమ్ చేసుకుంది.
ఈ ఏడాది మే 26న సచిన్ సినిమా విడుదలవుతోంది. ఈ విషయాన్ని సచినే స్వయంగా ప్రకటించాడు. ముంబైకి చెందిన కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంస్థ ‘సచిన్’ సినిమాను నిర్మిస్తుండగా.. బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఏర్స్‌కిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నాడు. సచిన్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని దేశంలోని అనేక భాషల్లోకి అనువాదం చేస్తారని సమాచారం. ఐతే సచిన్ సినిమా ‘ధోని’ తరహా ఫీచర్ ఫిల్మ్ కాదు. కొంచెం డాక్యుమెంటరీ టచ్ ఉంటుంది. సచిన్ ఆడిన మ్యాచ్ లకు సంబంధించిన రియల్ విజువల్స్ ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నప్పటి జీవితాన్ని మాత్రం నటన ద్వారా చూపిస్తారు. స్వయంగా సచినే ఈ చిత్రాన్ని నరేట్ చేయబోతుండటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/