సా..చిన్ సా...చిన్.... ఈ నినాదం వినిపిస్తే చాలు.. ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండె పులకిస్తుంది. రిటైరై అయిన రెండేళ్లు దాటిపోయినా సరే సచిన్ క్రేజ్ జనాల్లో ఏమాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతణ్ని ఇప్పటికీ దేవుడిలాగే కొలుస్తారు అభిమానులు. సచిన్ జీవిత చరిత్ర నేపథ్యంలో ‘సచిన్- ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొందనడానికి.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టీజర్.. రిలీజ్ చేసినపుడు సోషల్ మీడియాలో దాని గురించి జరిగిన చర్చే నిదర్శనం. నిన్న టీజర్ రిలీజైతే.. ట్విట్టర్ - ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.
‘ఫ్రమ్ ఎ వైల్డ్ ఛైల్డ్ టు ఎ వర్చువస్ హీరో’ అంటూ సచిన్ జీవిత గాథ మొత్తాన్ని ప్రేక్షకుల ముందు పెట్టాలని ‘సచిన్’ ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. ఐతే ఇది డాక్యుమెంటరీనా.. సినిమానా.. అసలు ఇందులో సచిన్ స్వయంగా నటిస్తున్నాడా.. లేక అతడి పాత్రను వేరెవరైనా పోషిస్తున్నారా.. అన్నదే అర్థం కావడం లేదు. అజహర్ - ధోనిల జీవిత చరిత్రతోనూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఐతే వాళ్ల పాత్రల్ని ఇమ్రాన్ హష్మి - సుశాంత్ రాజ్ పుత్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఎలాంటి దాపరికం లేదు. ఐతే ‘సచిన్’ సినిమా సంగతి ఏంటన్నదే తేలడం లేదు. టీజర్ చూస్తే సచిన్ ఈ సినిమాను నరేట్ చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది. అంటే చిన్ననాటి విశేషాలకు సంబంధించి మాత్రం నటీనటులతో చేయించి.. ఆ తర్వాత వాస్తవ మ్యాచ్ లకు సంబంధించిన దృశ్యాల్ని జోడించి.. దీన్ని సినిమాకు, డాక్యుమెంటరీకి మధ్యలో ఉండేలా తయారు చేస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో ‘సచిన్’ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
Full View