నాకూ రెజీనాకు ఇద్దరు కూతుళ్ళు కూడా!!

Update: 2017-12-04 18:38 GMT
సాధారణంగా కొంతమంది హీరోల చుట్టూ వచ్చే గాసిప్పులు ఎందుకో ఆగవ్. అందుకే రానా దగ్గుబాటి వంటి హీరోలు అవి లైట్ తీసుకుంటారు. అయితే రానా విషయంలో ఏమో కాని.. బ్యాక్ టు బ్యాక్ రెజీనా కసాండ్రాతో సినిమాలు చేసిన సాయిధరమ్ తేజ్ చుట్టూ మాత్రం ఓ రూమర్ స్ర్టాంగ్ గా తిరిగింది. అతను ఆమెను పెళ్ళిచేసుకుంటున్నాడని.. అందుకే ఇతర మెగా హీరోలు రెజీనాతో సినిమాలు చేయట్లేదని టాక్ వచ్చేసింది. అయితే ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చి ఇచ్చీ తనకు అలసట వస్తోంది అంటున్నాడు మెగా మేనల్లుడు.

''అవును. నాకూ రెజీనాకు ఎప్పుడో పెళ్ళయిపోయింది. మాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. పెద్దపాప ఆరు.. చిన్నాపాప సెకండ్ క్లాస్ చదువుతున్నారు. ఆ తరువాత నాకు రాశి ఖన్నాతో.. రకుల్ తో కూడా ఎఫైర్స్ ఉన్నాయి'' అంటూ ఎకసెక్కాలు ఆడాడు తేజు. అదేంటి రాజా అంటే.. ''ఎప్పుడూ అదే ప్రశ్నా.. ఎప్పుడూ రెజీనాతో ఎఫైరేనా.. ఇప్పుడు రెజీనాతో ఇంకో సినిమా చేద్దాం అంటే.. ఏ రూమర్ వస్తుందోనని భయపడి ఆగిపోతున్నా. పోనివ్ వేరే హీరోయిన్ తో చేస్తే.. ఆ హీరోయిన్లు కూడా ఈ గాసిప్పుల గురించి అడుగుతున్నారు'' అంటూ నిట్టూర్చాడు.

ఏదేమైనా కూడా.. జవాన్ సినిమా ప్రమోషన్లలో సాయిధరమ్ ఇలాంటి కామెంట్లు చేయడంతో కాస్త పస పెరిగింది. అసలే జవాన్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినవేళ.. మెగా మేనల్లడు ఇంటర్యూలను బాగా స్పయిస్ అప్ చేస్తున్నాడనమాట.
Tags:    

Similar News