అల్లుడు శీనుకి భయపడుతున్న బ్యాచిల‌ర్స్...!

Update: 2020-04-20 01:30 GMT
ప్రస్తుతం లాక్ డౌన్ టైంలో సినీ అభిమానులు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి చర్చించుకుంటున్నారు.. అవి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' 'సోలో బ్రతుకే సో బెటర్' 'అల్లుడు అదుర్స్'.. అక్కినేని అఖిల్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా బీవీఎస్సెన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక 'అల్లుడు అదుర్స్' విషయానికొస్తే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ చేస్తున్నాడు.

ఇప్పుడు అల్లుడు శీనుకి ఈ ఇద్దరు బ్యాచిల‌ర్స్ భ‌య‌ప‌డుతున్నారట. వివ‌రాల్లోకి వెళ్తే.. 'సోలో బ్ర‌త‌కే సో బెట‌ర్' సినిమాతో సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌రో హిట్ కొట్టాల‌ని బాగా ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా క‌థ ప్ర‌కారం మ‌నోడు సోలో లైఫ్ కి అల‌వాటు ప‌డ్డ‌.. సోలో లైఫ్ ఇష్ట ప‌డే ఓ బ్యాచిల‌ర్ కథ అని తెలుస్తోంది. మ‌రో వైపున ఇదే బ్యాచిల‌ర్ కాన్సెప్ట్ తో అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' రెడీ అవుతోంది. అయితే ష‌ట్ డౌన్ కార‌ణంగా ఈ సినిమాలు రెండు ఆగిపోయాయి. మ‌రో వైపు బెల్ల‌కొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' రెడీ అవుతోంది. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ మూడు సినిమాలు దాదాపు ఒకే స్టేజ్ ద‌గ్గ‌ర ఆగిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తక్కువై లాక్ డౌన్ ఎత్తేసాక ముగ్గ‌రు ఓకేసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే రిలీజ్ కూడా ఒకేసారి జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇక థియేట‌ర్స్ అవైలబులిటీ విషయానికొస్తే అఖిల్ కు ఎక్కువ హోల్డ్ ఉండే అవ‌కాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు థియేట‌ర్స్ దొరికినా లాభం లేదని చెప్పవచ్చు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ పరిస్థితి కూడా అంతే. ఈ రెండు సినిమాలు పెద్ద బ్యానర్లలో వస్తున్న సినిమాలు కావడంతో వీటికి థియేట‌ర్స్ సమస్య ఉండదు.

అయితే ఈ ముగ్గురు హీరోల్లో అటు శాటి లైట్ రైట్స్ ప‌రంగా.. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ పరంగా చూసుకుంటే అల్లుడు శీనుకి ఎక్కువ రేటు ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ విష‌య‌మే మిగ‌తా ఇద్ద‌రు హీరోల ప్రొడక్షన్ టీమ్స్ ని భయ‌పెడుతుంద‌ట. దానికి తోడు 'అల్లుడు అదుర్స్' అంటూ టైటిల్ లోనే మాస్ మాసాల ఎలిమెంట్స్ ఉండే సినిమా అని చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ త‌రువాత 'అల్లుడు అదుర్స్'కి ఎక్కువ డబ్బులు రాలే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతోందో చూడాలి.
Tags:    

Similar News