ఏదో ఒక టైటిల్ చెప్పేద్దాం.. పోయేదేముంది డ్యూడ్ మహా అయితే రూమర్ అంటారు. ప్రస్తుతం కొందరి బాబుల మైండ్ సెట్ ఇలానే ఉంది. ఇకపోతే మెగా ఫ్యామిలీ హీరో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఈ మద్య స్పీడ్ పెంచాడు. ఇప్పటికే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం లో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా పూర్తయ్యాక పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.
అయితే ఈ సినిమాకు శతమానం భవతి అనే టైటిల్ పెడుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించాడు అనిల్. సాయి ధరంతేజ్ సినిమాకు ఇంకా ఎ టైటిల్ అనుకోలేదని, త్వరలోనే మంచి టైటిల్ ఫిక్స్ చేసి చెబుతానని అంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంబం కానుంది. నిజానికి ఏదైనా పాత చిరంజీవి సినిమా టైటిల్ ను వాడదాం అనుకుంటున్నాడు అనిల్. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, హిట్లర్ వంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయట. అయితే వీటిలో ఏదైనా టైటిల్ చరణ్ కాని, బన్నీ కాని అడుగుతారేమో చూస్కొని అప్పుడు టైటిల్ కన్ఫాం చేస్తారని టాక్.