చిరంజీవి.. మోహన్ బాబు పోటాపోటీగా నటించిన సినిమాల్లో ఒకటి బిల్లా రంగా. 1982లో వచ్చిన ఈ సినిమాలో బిల్లా రంగాలుగా చిరంజీవి మోహన్ బాబుల నటన.. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా ఉంటుంది. ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉందని చెప్పేశాడు సాయి ధరం తేజ్.
రీసెంట్ గా గుంటూరోడు ఆడియో ఫంక్షన్ లో బిల్లా రంగాను రీమేక్ చేసే విషయాన్ని తేజు చెప్పగానే.. మైక్ తీసుకున్న మంచు మనోజ్ ఈ సబ్జెక్టును హ్యాండిల్ చేసే దర్శకుడి కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లు చెప్పాడు. చిన్నప్పటి నుంచి తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని.. కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్లమని చెప్పారు ఈ స్నేహితులు. 'నిజానికి వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన నా మొదటి సినిమా రేయ్ కి.. మంచు మనోజ్ కి కూడా సంబంధం ఉంది. మనోజ్ అన్న విష్ణుతో సలీం చిత్రాన్ని వైవీఎస్ తీస్తున్న సమయంలోనే.. నన్ను మనోజ్ తో కలిపి మొదటిసారి చూశారాయన' అని చెప్పాడు సాయిధరం తేజ్.
మనోజ్ పదేళ్ల క్రితం ఎలా ఉన్నాడో.. ఇప్పటికీ అలానే ప్రవర్తిస్తుంటాడని.. కొంచెం కూడా మార్పు రాలేదని అన్న తేజు.. 'నేను చిన్నప్పటి నుంచి మోహన్ బాబుగారికి పెద్ద ఫ్యాన్ ని. కానీ ఆ మాట చెప్పే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది' అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/