మెగాస్టార్ చిరంజీవి మేనల్లుళ్లు సాయి తేజ్ - పంజా వైష్ణవ్ తేజ్ ఇద్దరూ హీరోలుగా అడుగుపెట్టేశారు. ఇప్పటికే అన్న సాయి తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తుండగా.. తమ్ముడు 'ఉప్పెన' సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్.. యూత్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ కంటెంట్ బేస్డ్ మూవీని పూర్తి చేశాడు. 'జంగిల్ బుక్' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా గిరీశాయ దర్శకత్వంలో వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్ లో వైష్ణవ్ మూడో సినిమా స్టార్ట్ చేశాడు.
అయితే 'ఉప్పెన' చిత్రంతో యువతరానికి దగ్గరైన వైష్ణవ్.. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లోనే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లలో సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవాలని ప్లాన్ చేకుంటున్నాడు. మరోవైపు అన్న సాయి తేజ్ మాత్రం మాస్ హీరోగా నిలబడటానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఫస్ట్ సినిమా నుంచే మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు వస్తున్నాడు. కొన్ని లవ్ స్టోరీస్ చేసినా జనాలు పట్టించుకోలేదు. అందుకే మళ్ళీ మాస్ బాట పట్టాడు. ఇలా తమ్ముడు క్లాస్.. అన్న మాస్ అన్నట్లుగా ఇద్దరు సినిమాలు చేస్తున్నారు. అయితే మెగా అభిమానులు తమ హీరోలు మాంచి యాక్షన్ సినిమాలు తీయాలనే కోరుకుంటారు. మరి వైష్ణవ్ తేజ్ ఎప్పుడు మాస్ సినిమాలు ఎంపిక చేసుకుంటాడో చూడాలి.