మెగా మేనల్లుగా గతంలో ఎన్నడూ లేనంతగా డిఫరెంట్ డిఫరెంట్ మేకోవర్ లతో.. సరి కొత్త ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో బైక్ యాక్సిడెంట్ కి గురైన సాయి ధరమ్ తేజ్ ఆ ఆ షాక్ తో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
దీంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ తరువాత ఓ మైనర్ ఆపరేషన్ జరగడంతో ప్రమాదం నుంచి బయటపడిన ఆయన దాదాపు నెల రోజుల తరువాత హాస్పిటల్ నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి మీడియా ముందుకు రాకుండా ఇంటి పట్టునే వుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇటీవల కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వెళ్లిన సాయి ధరమ్ తేజ్ అక్కడ కూడా మీడియాకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని ఆశ్చర్యపరిచారు. `రిపబ్లిక్` తరువాత ఆయన నటించిన సినిమా ఏదీ ఇంత వరకు సెట్స్ పైకి రాలేదు. దీంతో నెక్స్ట్ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ మరి కొంత కాలం వేచి చూడాలనుకుంటున్నారా? అని వార్తలు వినిపించడం మొదలైంది. ఈ వార్తలకు చెక్ పెడుతూ వరుసగా సరికొత్త మేకోవర్ లతో అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయడం మొదలు పెట్టారు.
గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటూ ఇటీవల పోస్ట్ పెట్టిన సాయి ధరమ్ తేజ్ గత కొన్ని రోజులుగా తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. మళ్లీ తన పూర్వపు గెటప్ కి భిన్నంగా సరికొత్త మేకోవర్ లోకి మారిపోయిన సాయి ధరమ్ తేజ్ వరుస ఫొటో షూట్ లలో పాల్గొంటున్నారు.
తాజాగా ఖాకీ కలర్ బ్లేజర్ టైమ్ షర్ట్.. బ్లూ కలర్ జీన్స్ ధరించి డాపర్ లుక్ లో కనిపిస్తూ దర్శనమిచ్చారు. తాజా ఫొటో షూట్ కి సంబంధించిన ఫొటోలని అభిమానులతో పంచుకున్నారు. స్టైలిష్ లుక్ లో లైట్ షేవ్ తో కనిపిస్తున్న సాయి ధరమ్ తేజ్ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇదిలా వుంటే సాయి ధరమ్ తేజ్ `వినోదాయ సితం` రీమేక్ లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సముద్రఖని కీలక పాత్రలో నటించిన డైరెక్ట్ చేసిన ఈ మూవీని తెలుగులో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ తో రీమేక్ చేస్తున్నారు.
సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్న ఈ రీమేక్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి చేరిన ఈ మూవీని ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.