మెగా ఫ్యాన్స్ అందరూ కలిసుండాలి

Update: 2017-03-28 05:17 GMT
మెగా ఫ్యాన్స్.. పవర్ స్టార్ ఫ్యాన్స్.. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్.. ఏంటండీ ఇదంతా?? వీరంతా దాదాపు ఒకే ప్యామిలీకి చెందిన హీరోల ఫ్యాన్స్ కదా.. అసలు వీరి మధ్యన ఇన్నేసి డిఫరెన్సులు ఎందుకు? ఇదే విషయంపై యంగ్ హీరో సాయిధరమ్ స్పందించాడు. నిన్న మనోడు రామ్ చరణ్‌ బర్తడే సెలబ్రేట్ చేయడానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు వచ్చినప్పుడు.. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది.

ఫ్యాన్స్ అందరూ చరణ్ పేరు చెప్పినప్పుడు అరుస్తున్నారు కాని.. ఇతర మెగా హీరోల పేరు చెబుతుంటే అరవట్లేదు. కాని అందరి మెగా హీరోల ఫ్యాన్స్ కు పేరు పేరున విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ లోని అసహనం కనిపెట్టిన సాయిధరమ్.. ''మన మెగా ఫ్యాన్స్ అందరూ మెగా ఫ్యాన్స్ గా కలిసుండాలి. మనలో మనకు డిఫరెన్సులు ఎందుకు? మనమందరం ఒకటే. మెగాస్టార్ చిరంజీవిగారి బాటలో పయనిద్దాం. ఎప్పటికీ మనం కలిసుంటేనే బలం'' అంటూ కామెంట్ చేశాడు.

ఈ విషయం మరి చెప్పన బ్రదర్ అన్నవారూ.. చూసుకుంటాం బ్రదర్ అన్నవారూ.. కాస్త కనిపెట్టుకుంటున్నారా? లేకపోతే సాయిదరమ్ ఏదో చెప్పాడులే మా బాట మాదే అన్నట్లే ఉండబోతున్నారా? ఏమో మరి.. కాలమే సమాధానం చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News