మెగాహీరోకి గాడ్ ఫాదర్ కావాలా.. కామెడీలు..

Update: 2018-03-23 23:30 GMT
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోల్లో సాయి ధరం తేజ్ కు ఇప్పుడు వరుస ఫ్లాపులు ఎదరువుతున్నాయి. ఇందుకు ఈ కుర్రాడికి సరైన గైడెన్స్ లేదని.. అందుకే స్క్రిప్టుల ఎంపికలో జాగ్రత్త పడలేకపోతున్నాడనే టాక్ బయలుదేరింది.

రామ్ చరణ్ కు చిరంజీవి.. అల్లు అర్జున్- శిరీష్ లకు అల్లు అరవింద్.. వరుణ్ తేజ్ కు నాగేంద్రబాబు మాదిరిగా గాడ్ ఫాదర్ లేదా రియల్ ఫాదర్ ఎవరూ గైడెన్స్ ఇవ్వడం లేదని అందుకే కెరీర్ ను ఇబ్బందుల్లో నెట్టుకున్నాడన్నది వారి వాదన. నిజానికి ఇధి పెద్ద కామెడీ అనాల్సిందే. అసలు మెగా హీరో అనే ట్యాగ్  ఉంది. అసలు మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. కుటుంబం నుంచి సపోర్ట్.. అంతకంటే ఎవరికైనా ఏం కావాలి. కొన్ని సెలక్షన్స్ మిస్టేక్స్ అయుండవచ్చు. ఇప్పుడు కాదు ఇంకొన్నాళ్లకు అయనా సరే కరెక్ట్ ఫిలిం కాని పడితే చాలు.. మెగా పవర్ ఏంటో.. మెగా ఫ్యాన్స్ ఆదరణ ఎలా ఉంటుందో అర్ధం అవుతుంది.

ఈ విషయాలు అన్నీ తేజుకి తెలియనివి ఏమీ కావు. చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా మెగాస్టార్ రేంజ్ కి చేరుకున్నారు. పెద మామయ్య స్ఫూర్తితో తాను సొంతగా ఎదగాలని ట్రై చేస్తున్నాడు తేజు. చిరంజీవి వేసిన రోడ్ల మీద కార్లు తోలుకుంటున్నారు. ఎవరి కారు ఎలా డ్రైవ్ చేసుకోవాలో సొంతగా నిర్ణయించుకునే నైపుణ్యం అబ్బే విధంగా మెగా ఫ్యామిలీలో స్వేచ్ఛ ఉంటుంది.

ఒక వేళ అవసరం అయితే.. తను అడిగితే మెగాస్టార్ అయినా.. పవర్ స్టార్ అయినా కాదంటారా అని నవ్వుకుంటున్నాడట తేజు. అయినా చిరంజీవి- పవన్ కళ్యాణ్ లకు మేనల్లుడు అనే బ్రాండ్ కంటే ఇంకేం అవసరం అని సన్నిహితులతో అంటున్నాడట. అడపాదడపా ఒకట్రెండు వేరియేషన్స్ వచ్చినా.. సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ చూపించే యూనిటీ.. కమిట్మెంట్ మరే హీరోకు కనిపించదన్న మాట అయితే వాస్తవం.
Tags:    

Similar News