టాలీవుడ్ లో చాలామంది హీరోలు - స్టార్లు ఉంటారు కానీ.. అందులో అతి ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోగా సాయి ధరం తేజ్ కొత్త రికార్డ్ సృష్టించేస్తున్నాడు. ఇప్పుడీ మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. కుర్రాడు చేసిందే మూడు సినిమాలు, అందులో ఒకటి ఫ్లాప్ - ఒకటి యావరేజ్ - ఒకటి హిట్. మరి మూడింటితోనే ఇంత క్రేజ్ ఏర్పడ్డానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. నిర్మాతలు కోట్లు కురిపించే మిషన్ గా మారిపోవడమే అని తెలుస్తోంది.
సాయిధరం తేజ్ తో సినిమా తీస్తే 10 కోట్లు ప్రాఫిట్ గ్యారంటీ. సుప్రీం రైట్స్ అమ్మకాలతో దిల్ రాజు పాకెట్ కి చేరిన మొత్తం ఇది. ఇదే నిర్మాతలను తెగ ఊరిస్తోంది. మీడియం రేంజ్ స్టార్లతో సమానంగా కలెక్షన్స్ కురిపించగలడు.. వాళ్లు డిమాండ్ చేసినంతగా రెమ్యూనరేషన్ అడగడు. అంతా కలిపినా, పది కోట్ల లోపే సినిమా కంప్లీట్ అయిపోతుంది. రెట్టింపు వరకూ కలెక్షన్స్ రాబట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకే సాయిధరం తేజ్ తో సినిమా కోసం నిర్మాతలు వెంటబడుతుండగా.. కొత్త దర్శకులు కూడా తమను సేఫ్ లాంఛ్ చేయగల ఏకైక హీరోగా తేజునే ఎంచుకుంటున్నారు.
కరెక్ట్ హిట్ ఒకటి పడితే స్టార్ రేంజ్ కి తేజు ఎదిగిపోతాడని ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. ప్రస్తుతం సుప్రీంతో పాటు తిక్కను కూడా కంప్లీట్ చేస్తున్న సాయిధరం తేజ్, మరో మూడు సినిమాలకు కూడా సైన్ చేసేశాడు.