ఎన్టీఆర్: బాహుబలి స్టైల్ లో కొర్రపాటి బోణీ.. !

Update: 2018-09-23 12:30 GMT
టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' ఒకటి.  సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు దసరా కంటే ముందుగా ప్రీరిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఉత్తరాంధ్ర మూడుజిల్లాలు తో పాటుగా కృష్ణాజిల్లా కు రూ. 11.40 కోట్లకు సాయి కొర్రపాటి థియేట్రికల్ రైట్స్ డీల్ ఫైనల్ చేసుకున్నాడట.

బాలయ్య మార్కెట్ ప్రకారం ఇది చాలా పెద్ద మొత్తమే.  ఈ రేషియో ప్రకారం ఆంధ్రా రైట్స్ 30 కోట్లు.. సీడెడ్ 12 కోట్లు.. నైజాం 18 కోట్లకు అమ్మాల్సి ఉంటుంది. ఒక్క సీడెడ్ తప్ప ఈ రేంజ్ లో రేట్లు పలకడం కష్టమని.. చూస్తుంటే 'ఎన్టీఆర్'  నిర్మాతలు 'బాహుబలి' కి రాజమౌళి ఫాలో అయిన ప్లాన్ ఫాలో అవుతూ సాయి కొర్ర పాటి భారీ రేట్లకు కొన్నాడని లీకులిస్తూ మిగతా ఏరియాలకు భారీ రేట్ ను కోట్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం 'ఎన్టీఆర్' బయోపిక్ కాబట్టి సినిమాకు క్రేజ్ చాలా ఎక్కువగా ఉందని.. సంక్రాంతి సీజన్ కాబట్టి వసూళ్ళకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని.. ఆ రేట్ సరైనదేనని అంటున్నారు. ఈ లెక్కన బాలయ్య చిత్రం కెరీర్ బెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడం ఖాయం.
Tags:    

Similar News