ఆ రైటర్ కి పట్టిందల్లా బంగారం

Update: 2015-08-20 02:25 GMT
ట్యాలెంట్ ఉన్నోడికి అదృష్టంతో పని లేదని నిరూపించాడు మాటల రచయిత సాయి మాధవ్. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన క్రిష్ణం వందే జగద్గురుంతో కెరీర్ స్టార్ట్ చేశాడీయన. తర్వాత గోపాల గోపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రాజు, దొంగాట లతో  హ్యాట్రిక్ కొట్టేశాడీయన. రియల్ లైఫ్ లో ఎదురయ్యే సంఘటనలను మేళవించి తూటాల్లాంటి మాటలు రాస్తుండడంతో.. వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి సాయి మాధవ్ కు.  మొదటి నాలుగు సినిమాలను 4 విభిన్న జోనర్ల లో ఉండడం విశేషం.

మూవీల సక్సెస్ లో డైలాగ్స్  కీలకపాత్ర పోషించాయనే పేరు తెచ్చుకోవడంతో తిరుగులేకుండా దూసుకుపోతున్నాడీ రైటర్. ఇప్పుడీయన చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉండడం విశేషం. పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్, నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్నినాయన, రిలీజ్ కు రెడీ అయిన వరుణ్ తేజ్ కంచెలతోపాటు... మరో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రానికి..  తెలుగు వెర్షన్ కు మాటలు సమకూరుస్తున్నాడు సాయి మాధవ్. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న కంచె పీరియాడికల్ డ్రామా అని... యుద్ధం బ్యాక్ డ్రాప్ గా వస్తున్న సినిమా అని చెప్పిన సాయి మాధవ్... ఈ చిత్రం తనకు మరింత పేరు తెస్తుందని అంటున్నాడు. ప్రతిభావంతుడైన ఈ తెనాలి వాసికి... వరుసగా అవకాశాలు రావడానికి కారణం.. ట్యాలెంటే అని చెప్పక తప్పదు.

అయితే... ఇప్పటివరకూ అన్ని భారీ సినిమాలే చేస్తున్నా. చిన్న సినిమాలకైనా చేస్తానంటున్నాడు. సబ్జెక్ట్ నచ్చితే అసలు రెమ్యూనరేషన్ సంగతి పట్టించుకోడట. పదునైన మాటలతో పాటు మంచి మనసు కూడా ఉన్నట్లుంది ఈయనకు. బెస్టాఫ్ లక్ సాయిమాధవ్
Tags:    

Similar News