పంచ్ లు, ప్రాసలు రాయగలిగితేనే మంచి రచయిత అనే భ్రమల్లో ఉన్న టాలీవుడ్ జనాలకు కృష్ణం వందే జగద్గురుం - గోపాల గోపాల - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలతో పెద్ద పాఠం నేర్పించాడు సాయి మాధవ్ బుర్రా. ఆ మూడు సినిమాల్లోనూ సందర్భోచితంగా అనిపించే ఆణిముత్యాల్లాంటి మాటలు రాసి.. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడతను. ఐతే అతడి ట్రాక్ రికార్డు చూసి.. కమర్షియల్ సినిమాలకు రాయలేడేమో అని చాలామంది అనుమాన పడ్డారు. ఐతే పవన్ కళ్యాణ్ ఆ అభిప్రాయాన్ని మార్చేయబోతున్నాడు.
ప్రస్తుతం సాయిమాధవ్ వరుసగా పవన్ నటించిన రెండు సినిమాలకు మాటలందిస్తున్నట్లు సమాచారం. చాలామంది రచయితల హ్యాండ్ పడిన గబ్బర్ సింగ్-2 స్క్రిప్టును పవన్ పట్టుకెళ్లి చివరగా సాయిమాధవ్ చేతిలో పెట్టినట్లు సమాచారం. ‘సర్దార్’గా పేరు మార్చుకున్న ఈ సినిమాకు సాయిమాధవే మాటలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబి స్వయంగా రచయితే అయినా.. సాయిమాధవ్ మీద ఉన్న గురితో అతడికే బాధ్యతలప్పగించాడట పవన్. అంతే కాదు.. గోపాల గోపాల డైరెక్టర్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కబోయే తర్వాతి సినిమాకు కూడా అతడితో మాటలు రాయించుకోమని సెలవిచ్చాడట. మొత్తానికి పవన్ లాంటి స్టార్ ను పడేశాడంటే.. ఇక టాలీవుడ్లో సాయిమాధవ్ కు తిరుగులేనట్లే.