ఏ భాషలోనైనా సినిమా ఇండస్ట్రీ రూపు రేఖలు .. అక్కడి వాతావరణం ఒకేలా ఉంటాయి. భాష వేరైనా .. ప్రాంతం వేరైనా అక్కడ నెగ్గుకురావాలంటే ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి .. ఆ ప్రత్యేకతను అంగీకరించే ఆడియన్స్ ఉండాలి .. దానికి తోడుగా సక్సెస్ రావాలి. లేదంటే ఎవరైనా ఇంటి బాట పట్టవలసిందే. ఇది గ్లామర్ ఫీల్డ్ .. కథానాయికగా ఇక్కడ నిలబడాలంటే ఉండవలసింది గ్లామరే. అందంగా ఉంటేనే .. అభినయం నేర్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే సర్దుకోవడానికి సమయం పెద్దగా ఉండదు.
ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లోనే గ్లామర్ డోస్ తగ్గిపోయిందని చెప్పేసి .. మరో హీరోయిన్ తో మాస్ మసాలా సాంగ్స్ చేయిస్తున్న రోజులివి. అలాంటిది ఉన్న ఒక్క హీరోయిన్ కూడా ఎంత మాత్రం స్కిన్ షో చేయదని తెలిస్తే అందరు ఆడియన్స్ అంగీకరిస్తారా? అలాంటి హీరోయిన్స్ కి అవకాశాలు వస్తాయా?
అనేది అందరికీ తెలిసిన విషయమే. సరైన కథలను .. పాత్రలను ఎంచుకుంటే సాధ్యమే అని నిరూపించిన కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది. సాయిపల్లవి పెద్ద అందగత్తె కాకపోవచ్చును గానీ .. ఆకర్షణకి కొదవలేదు.
ఈ రోజున ఏ గ్లామరస్ హీరోయిన్ కి లేని క్రేజ్ సాయిపల్లవి సొంతం. ఆమె చేసిన 'విరాట పర్వం' ఫ్లాప్ అని చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ 'విరాటపర్వం' ఒక కథ కాదు .. జీవితం. అందువలన దాని సక్సెస్ ను వసూళ్లతో కొలవలేం. ఆ సినిమా ఎన్నాళ్ల తరువాత చూసినా సాయిపల్లవి నటనకి మళ్లీ కొత్తగా మార్కులు ఇవ్వాలనిపిస్తుంది.
అలాంటి సాయిపల్లవి తాజాగా తమిళంలో చేసిన 'గార్గి' ఈ నెల 15వ తేదీన తెలుగులోను విడుదలవుతోంది. ఇది సాయిపల్లవికి తగిన కథ అనే విషయం పోస్టర్ ను చూస్తేనే తెలిసిపోతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి మాట్లాడుతూ .. "కొన్ని కథలు .. పాత్రలు ఆత్మసంతృప్తిని ఇస్తాయి .. సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తాయి. అలాంటి ఒక సంతృప్తి కోసమే పవన్ కల్యాణ్ గారు 'వకీల్ సాబ్' చేశారని నేను అనుకుంటున్నాను. ఆయనకి ఉన్న ఇమేజ్ వేరు .. క్రేజ్ వేరు .. అయినా ఆయన ఆ సినిమా చేసింది జనం కోసమే .. జనాన్ని ఆలోచింప చేయడం కోసమే. అలా ఆలోచింపజేసే చిత్రమే 'గార్గి'. ఇలాంటి మంచి సినిమాలు మళ్లీ రావాలంటే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి" అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా కథ నచ్చి తమిళంలో సూర్య .. తెలుగులో రానా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.