టాలీవుడ్ హీరోయిన్సు లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ గ్లామరస్ హీరోయిన్ కి లేని ఫాలోయింగ్ ఆమెకి ఉంది. అందుకు కారణం ఆమె చేసిన పాత్రలు .. ఆ పాత్రల్లో ఆమె ఇమిడిపోయిన తీరు. సాయిపల్లవి పోషించిన పాత్రలను ఒకసారి పరిశీలిస్తే, వ్యక్తిత్వం ఉన్న పాత్రలను మాత్రమే ఆమె అంగీకరిస్తుందనే విషయం అర్థమవుతుంది. కేవలం ఆడిపాడే పాత్రలను చేయడానికి ఆమె అంగీకరించదు. పారితోషికం ఎంత ఇస్తానని చెప్పినా ఆమె పెద్దగా పట్టించుకోదు.
పారితోషికం పెంచేసి .. విషయంలేని పాత్రలను సాయిపల్లవితో చేయించలేమనే టాక్ బయటికి వచ్చిన తరువాత ఆమెపై అందరికీ మరింతగా గౌరవం పెరిగిపోయింది. అంతేకాదు సాయిపల్లవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుందంటే, ఆ కథలో కొత్తదనమేదో ఉందనే నమ్మకం పెరిగిపోతూ వచ్చింది.
యూత్ లో సాయిపల్లవికి ఎంత క్రేజ్ ఉందో .. ఫ్యామిలీ ఆడియన్స్ లో అంతకుమించిన క్రేజ్ ఉంది. సాయిపల్లవిని అందరూ కూడా తమ కుటుంబ సభ్యురాలిగానే భావిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ తన పట్ల చూపుతున్న ఆదరణ గురించి సాయిపల్లవి కూడా చాలాసార్లు ప్రస్తావించింది.
తాజాగా టాలీవుడ్ హీరోల్లో తన బెస్ట్ ఫ్రెండ్స్ ను గురించి ఆమె ప్రస్తావించింది. " రానా .. చైతూ ఇద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ కూడా నన్ను తమ కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటూ ఉంటారు. నా విషయంలో వాళ్లు చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు" అని చెప్పుకొచ్చింది. ఆమె చైతూతో 'లవ్ స్టోరీ' .. రానాతో 'విరాటపర్వం' చేసిన సంగతి తెలిసిందే. సాయిపల్లవి సినిమాల సక్సెస్ ను వసూళ్లతో తూచలేం. ఆమె నటన పరంగా చూసుకుంటే ప్రతి సినిమా హిట్టే అనిపిస్తుంది.
ఇక తెలుగులో సాయిపల్లవి కొత్తగా సైన్ చేసిన సినిమాలేవైనా ఉంటే వాటి గురించి తెలియవలసి ఉంది. తమిళంలో మాత్రం 'గార్గి' అనే ఒక సినిమా చేసింది. ఈ సినిమా నిర్మాతలలో హీరో సూర్య ఒకరుగా ఉండటం విశేషం.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథ అంతా కూడా సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంది. సమాజంలో ఆడపిల్లకు ఎదురవుతున్న సమస్యలే ఈ కథలో ప్రధానమైన అంశం. ఆ పరిస్థితులపై పోరాటం చేసే యువతినే 'గార్గి'. త్వరలోనే ఈ సినిమా తెలుగు .. కన్నడ భాషల్లోను విడుదలకానుంది.