హైబ్రిడ్ పిల్ల‌తో య‌వ్వారం అంటే? అట్లుంట‌ది మ‌రి!

Update: 2022-06-09 23:30 GMT
సాయిప‌ల్ల‌వి అలియాస్ హైబ్రిడ్ పిల్లలో ప్ర‌త్యేక‌త‌లు అన్ని ఇన్ని కావు. అమ్మ‌డు ఇండ‌స్ర్టీకి కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌తో  ఎంట్రీ ఇచ్చింది. సినిమా క‌మిట్ అవ్వాలంటే? త‌న పాత్ర‌కు ప్ర త్యేక‌మై ఐడెంటీటీ ఉండాలి. మేక‌ర్ ఆ విధంగా స్ర్కిప్ట్ లో హీరోయిన్ పాత్ర‌కి ప్రాధాన్య‌త ఇస్తేనే లాక్ అవుతుంది.  లేదంటే నిర్మొహ‌మాటంగా నో  చెప్పేస్తుంది.

ఇక  గ్లామ‌ర్ పాత్ర‌లంటే అమ్మ‌డు ద‌ర్శ‌కుల్ని ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌దు. ఎన్ని కోట్లు పారితోషికం ఆఫ‌ర్ చేసినా నో వే అనేస్తుంది. తాను గీసుకున్న గీత లోబ‌డే అన్ని ఉండాలి. అవి స‌సేమీరా దాట‌న‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేస్తుంది. ఆర‌కంగా అవ‌కాశాల ప‌రంగా మిగ‌తా  నాయిక‌ల‌తో పొల్చుకుంటే  వెనుక‌బ‌డే ఉంది. కానీ త‌న‌లో ఆ క్వాలీటీనే అమ్మ‌డి మైలేజ్ ని పెంచుతుంద‌న్న‌ది వాస్త‌వం.

ఇక వ్య‌క్తిగ‌తంతో త‌న ద్వారా  ఏదైనా హాని జ‌రుగుతుందంటే?  అలాంటి వాటిని ఏ మాత్రం ఎంకరేజ్ చేయ‌దు. ఆ మ‌ధ్య ఫెయిర్ నెస్ క్రీమ్ సంస్థ భారీ పారితోషికం ఆఫ‌ర్ చేసి త‌మ బ్రాండ్ ని ఎండార్స్ చేయాల్సిందిగా కోరింది. కానీ సాయి ప‌ల్ల‌వి అందుకు అంగీక‌రించ‌లేదు. సౌంద‌ర్య ఉత్ప‌త్తుల‌కు సంబంధించి పూర్తి అవ‌గాహ‌న లేకుండా ఎలా చేయ‌గ‌ల‌న‌ని రిజెక్ట్ చేసింది.

ఆ ర‌కంగా కోట్ల రూపాయ‌ల్ని న‌ష్ట‌పోయింది. ఆ స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి ఇలాంటి ఆఫ‌ర్  ని వ‌దులుకుందేట‌ని? ఆశ్చ‌ర్య‌పోయారు. అక్క‌డే మ‌రోసారి త‌న గుణ గ‌ణాలు ఎలాంటివి అన్న‌ది బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ 2 కోట్లు ఆఫ‌ర్ ని సున్నితంగా తిర‌స్క‌రించి మ‌రోసారి మీడియాలో  హాట్ టాపిక్ గా మారింది.

ఓ ఛానెల్ లో ప్ర‌సార‌మ‌య్యే ఈవెంట్లు..సీరియ‌ల్స్ ప్ర‌మోట్ చేయ‌డానికి స‌ద‌రు ఛాన‌ల్ సాయి ప‌ల్ల‌వికి ఈ ఆఫ‌ర్ ఇచ్చింది. కానీ వీటిపై త‌న‌కెలాంటి క్లారిటీ లేద‌ని..అలాంటి వాటిని ప్రోత్స‌హించి ప్రేక్ష‌కుల్ని త‌ప్పు దారి ప‌ట్టించ‌లేన‌ని ..అందుకే ఆఫ‌ర్ ని వ‌దులుకున్న‌ట్లు  తెలిపింది. ఇలా వ‌దులుకోవ‌డం ప‌ల్ల‌వి కొత్తేం కాదు. త‌న క్రేజ్ ని గుర్తింపుగా చాలా ఆఫ‌ర్లే వ‌రించాయి.

కానీ వాట‌న్నింటిని ఎంతో సున్నితంగా తిర‌స్క‌రించి త‌న గొప్ప‌త‌నాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాని సైతం వ‌దులుకుందంటే? ఆమె వ్య‌క్తిత్వం ఎలాంటిద‌న్న‌ది అంచ‌నా వేయోచ్చు.  చిరు  క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `భోళా శంక‌ర్` చిత్రంలో సిస్ట‌ర్ రోల్ ఆఫ‌ర్ ముందుగా సాయి ప‌ల్ల‌వికే వ‌చ్చింది.

 కానీ ఆమె చిరంజీవితో పోటాపోటీగా డాన్స్ చేయాల‌ని ఆశ‌ప‌డుతుంది. ఆయ‌న‌కు జోడీగా న‌టించాల‌ని క‌ల‌లు కంటోంది. అందుకే చెల్లి పాత్ర‌కి  నో  చెప్పి..చెలియా లా క‌నిపించాల‌ని ఆశ‌ప‌డుతుంది. ద‌టీజ్ సాయి ప‌ల్ల‌వి. అమ్మ‌డితో య‌వ్వారం అంటే అట్లుంట‌ది మ‌రి.
Tags:    

Similar News