సాయిపల్లవి .. ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాయిపల్లవి ఒక సినిమా చేస్తోంది అంటే, ఆ కథలో ఏదో కొత్తదనం ఉన్నట్టుగా లెక్క. అంతగా అందరికీ ఆమె పట్ల ఒక నమ్మకం ఏర్పడిపోయింది. సాయిపల్లవికి యూత్ లో ఎంత క్రేజ్ ఉందో .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను అంతే క్రేజ్ ఉంది. నటన .. డాన్స్ ఈ రెండింటిలోనూ ఆమెకి తిరుగులేదు. ఇక ఎంత బలమైన .. బరువైన కథనైనా చివరివరకూ మోయగల సామర్థ్యం ఆమె సొంతం. అందువల్లనే తెలుగు .. తమిళ భాషల నుంచి ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి.
ఇటీవల సాయిపల్లవి నుంచి 'విరాటపర్వం' సినిమా వచ్చింది. ఈ సినిమా వసూళ్ల సంగతి అలా ఉంచితే, నటన పరంగా ఆమెను ఈ సినిమా మరో మెట్టుపైకి తీసుకుని వెళ్లింది. ఇక ఇప్పుడు తమిళంలో ఆమె చేసిన 'గార్గి' తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ.
తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథ అంతా కూడా సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి బిజీగా ఉంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ను ఆమె తన భుజాలపై వేసుకుంది. తమిళంలో ఆమె ఈ సినిమాను సూర్య - జ్యోతికలకు చూపించింది. ఈ సినిమా చూసిన వాళ్లిద్దరూ తమిళంలో తాము ప్రెజెంట్ చేయడానికి ముందుకు వచ్చారు.
ఉదయనిధి స్టాలిన్ కూడా తనవంతుగా ఈ సినిమాను జనంలోకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సాయిపల్లవి చెప్పింది. ఇక తాను ఒక్క కాల్ చేయగానే తనపై గల నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో సమర్పించడానికి రానా ఒప్పుకోవడం విశేషమని అంది.
"ఈ సినిమాకి సమర్పకురాలిగా నా పేరు వేస్తామని నిర్మాతలు అన్నారు. నా సినిమాను నేను సమర్పించుకోవడం ఏమిటి? నా దగ్గరికి మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు .. ఆ సినిమాను నేను నిర్మిస్తే బాగుంటుందని అనిపించినప్పుడు పూర్తి నిర్మాతగా మారతాను" అంటూ సాయిపల్లవి చెప్పింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు కనుక, త్వరలో సాయిపల్లవి కూడా నిర్మాతగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.