బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ - ఆమె భర్త సైఫ్ అలీఖాన్ - ముద్దుల తనయుడు తైమూర్‌తో కలిసి ఇటు సోషల్ మీడియాలో అటు ప్రధాన వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కరీనా సోదరి కరిష్మా కపూర్ లతో కలిసి లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాలలో సరదాగా గడిపి తిరిగి ముంబై చేరుకున్న సందర్భంగా ముంబై ఎయిర్ పోర్టులో ఈ నవాబ్ కుటుంబం రిచ్ స్టైలిష్ లుక్ లో కళ్లు చెదిరేలా దర్శనమించారు. తాజాగా, ఇప్పుడు తన కొడుకు రక్షణ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ముఖ్యం కాదని, బిడ్డ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటాడో వారికే అప్పగిస్తానని కరీనా కపూర్ వ్యాఖ్యానించారు. ఓ డైపర్ బ్రాండ్ కోసం ఏకంగా రూ.కోటిన్నరకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ దంపతుల గారాల పట్టి తైమూర్ అలీఖాన్ పుట్టుకతోనే సెలబ్రిటీ స్థాయి అందుకున్న సంగతి తెలిసిందే. స్టార్ కిడ్ గా గుర్తింపు పొందిన.. ఈ చోటా నవాబ్ ఎక్కడ కనిపించినా కెమెరాలన్నీ అతడి వైపే తిరుగుతాయి. ఈ బాలీవుడ్ హీరోయిన్ తన కుమారుడి సంరక్షణలో భాగంగా - తమ బిడ్డకు సంబంధించిన ఆరోగ్య చర్యల్లో భాగంగా ప్రత్యేక డైపర్లు రూపొందించాలని చర్చలు జరిపినట్లు సమాచారం. ఏకంగా రూ.1.5 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ముందుగా డీల్ రద్దు చేసుకోవాలని భావించారట. పెద్ద మొత్తం పేరుతో వెనక్కు తగ్గాలని అనుకున్న అయినప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ - ఆమె భర్త సైఫ్ అలీఖాన్ అనంతరం డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, తైమూరు బయటికి వస్తే చాలు తైమూర్ చుట్టూ చేరి సెల్ఫీల కోసం జనాలు పోటీ పడుతుంటారు. అలాంటి సమయాల్లో మీడియా - ఫ్యాన్స్ నుంచి తైమూర్ ని రక్షించడం కోసం నవాబ్ దంపతులు అతడి కోసం కేర్ టేకర్ ను నియమించారు. నిరంతరం తైమూర్ వెంటే ఉండే ఆమెకు నెలకు లక్షా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నారంటూ కొంతకాలంగా బీ-టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భంలో అతడితో పాటే ఉండాల్సి వస్తే మరో 50 వేలు కూడా అదనంగా ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.