పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్` రిలీజ్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తుంటే అంతకంతకు సినిమా వెన్కి వెళ్తోంది తప్ప ముందుకు రావడం లేదు. షూటింగ్ పూర్తయింది...ఈ రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తై సంక్రాంతి కి వచ్చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నా..వాటిపైనా నీళ్లు జల్లేసింది టీమ్.
మరోసారి వాయిదా వేసి కొత్త తేదీని ప్రకటించింది. ఈసారి ఏకంగా మరో ఆరు నెలలో వాయిదా వేయడంతో అభిమానులు మరింత నిరుత్సాహానికి గురవుతున్నారు. మరి ఈ వాయిదా కి అసలు కారణం ఏంటి? అంటే ఆసక్తికర సంగతులే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంత కాలం డిలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా వాయిదా పడుతుందని భావించిన నేపథ్యంలో అసలు విషయం లీకైంది.
సినిమాలో రావణాసురుడి పాత్రకు సంబంధించి మొత్తం మళ్లీ రీ షూట్ చేయాలని దర్శకుడు ఓ రౌత్ భావిస్తున్నారుట. ఆ పాత్రపై వచ్చిన నెగిటివిటీ తొలగిపోవాలన్నా.. ఆ పాత్ర మరింత ఆసక్తికరంగా మలచలన్నా చాలా చోట్లు రీ షూట్ చేస్తే తప్ప పర్పెక్షన్ కనిపించదని రౌత్ కి ఆలస్యంగా తట్టిందన్న విషయంలో బాలీవుడ్ సహా టాలీవుడ్ లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సినిమా ఆరు నెలలు పాటు మళ్లీ వాయిదా వేడయానికి అసలు కారణం ఇదేనంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. వాస్తవానికి గ్రాఫిక్స్ పనులు కారణంగా ఇంత కాలం వాయిదా పడుతుందని అంతా భావించారు. ఇలాంటి కారణం ఒకటుందని ఊహించలేదు. ఆదిపురుష్ ప్రచార చిత్రాలు రిలీజ్ అయిన నేపథ్యంలో వాటిపై ఎలాంటి నెగివిటీ స్ర్పెడ్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణుడి పాత్రని టార్గెట్ చేసి ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. ఇవన్నీ తొలగిపోయి సినిమాపై హైప్ క్రియేట్ అవ్వాలంటే? మార్పులు తప్పవని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సమస్యల్లా? సైఫ్ అలీఖాన్ తోనే ముడిపడి ఉందని సమాచారం. ఇప్పటికిప్పుడు మార్పులు చేయాలంటే సైఫ్ అదనంగా కాల్టీట్లు కేటాయించాల్సి ఉంది.
కానీ సైఫ్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో డేట్లు కేటాయించడం కష్టమవుతుందన్న వార్త వినిపిస్తుంది. ఆయన ఇప్పటికే పలు సినిమాలకు డేట్లు కేటాయించి ఉన్నారు. వాటికి సంబంధించి రెగ్యులర్ షూట్ కి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అదిపురుష్ కోసం సమయం కేటాయించడం వీలుపడుతుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంలో సైఫ్ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఆదిపురుష్ మరింత డిలే అవ్వడానికి అవకాశం ఉందంటున్నారు.