సడన్‌ స్టార్‌ అయ్యే లక్షణాలున్నాయ్‌

Update: 2015-03-17 12:25 GMT
ఎంతసేపూ హీరోలే స్టార్లు అవ్వాలేంటండీ.. హీరోయిన్లు కూడా అప్పుడప్పుడూ హీరయిన్స్‌ కూడా ఇలా సడన్‌ స్టార్స్‌ అయిపోతారు. ఎక్కడి నుండో వచ్చి సడన్‌గా ఓ పెద్ద హీరోయిన్‌ అయిపోయిన భామలు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు సమంతనే తీసుకుందాం.

అప్పటివరకు త్రిష, కాజల్‌ వంటి భామలు మోడలింగ్‌ చేసి ఆ తరువాత పోర్ట్‌ఫోలియో ఫోటోలు పట్టుకొని చెప్పులు అరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగితే.. చివరకు చిన్న చిన్న సినిమాలు ఓ రెండు మూడు చేసి అప్పుడు పెద్ద హీరోయిన్స్‌ అయ్యారు. కాని సమంత అలా కాదు. తమిళంలో చిన్న సినిమాలు ఓ రెండు చేసింది కాని, తెలుగులో మాత్రం ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇవ్వగానే పెద్దస్టార్‌ అయిపోయింది. వెంటనే పెద్ద హీరోయిన్‌గా అవతారం ఎత్తేసింది. అందుకే ఆమెను సడన్‌ స్టార్‌ అనడంలో మరి తప్పులేదు.

ఇకపోతే తాజాగా ''రేయ్‌'' సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ గట్రా చూస్తుంటే.. ఒక ప్రక్కన బెంగాళీ హాటీ శ్రద్దా దాస్‌ ఎంత హాట్‌గా ఉందో, మరోప్రక్కన సయామీ ఖేర్‌ అంతకంటే హాట్‌గా ఉంది. ఈ కింగ్‌ ఫిషర్‌ మోడల్‌ను చూస్తుంటే యూత్‌కు ఫీజులు కొట్టేస్తున్నాయి. మరి ఈమె ఇప్పుడు సడన్‌ స్టార్‌ అవుద్దంటారా? చూద్దాం.

Tags:    

Similar News