ప్యాడ్స్ కట్టుకుని విషెస్ చెప్పిన 'రేయ్' భామ

Update: 2017-04-24 06:38 GMT
విడుదల ఆలస్యం కావడంతో.. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత థియేటర్లలోకి వచ్చినా.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరం తేజ్ తొలి సినిమా రేయ్. ఆ మూవీతో సినీ అరంగేట్రం చేసిన భామ సయామీ ఖేర్. ఇక్కడ ఎలా పెద్ద ఫ్యామిలీ హీరోతో అరంగేట్రం చేసిందో.. బాలీవుడ్ లో కూడా అదే అవకాశం లభించింది. అనిల్ కపూర్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ తో మిర్జియా మూవీ చేసి.. బీ టౌన్ ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ కూడా సేమ్ రిజల్ట్ ఎదురైంది కానీ.. సయామీ ఖేర్ కి మాత్రం క్రేజ్ బాగానే వచ్చింది. ఇవాళ ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా.. ఓ స్పెషల్ ట్వీట్ పెట్టింది ఈ హీరోయిన్. నెట్స్ లో ప్యాడ్స్ కట్టుకుని క్రికెట్ ఆడేస్తూ ఓ వీడియోతో పాటు.. 'నువ్వు ఆడుతుంటే ఎంతో సంతోషంగా ఫీలవుతూ.. అదే ఆనందంతో జీవిస్తూ.. నేనూ క్రికెట్ నేర్చుకున్నాను. నీలా కనిపించేందుకు నా ఒక చిన్న ప్రయత్నం సచిన్' అంటూ ట్వీట్ చేసింది సయామీ.

స్లీవ్ లెస్ డ్రెస్ లో అమ్మడు క్రికెట్ ఆడుతుంటే సీన్ సూపర్బ్ గా ఉంది కానీ.. షాట్స్ విషయంలో మాత్రం అచ్చు సచిన్ ని ఇమిటేట్ చేసేలా భలేగా అనుకరిచింది. అందివచ్చిన బాల్ ను సచిన్ బాదినట్లే ఇరగ బాదేసింది సయామీ. అసలు ఈ వీడియో చూసే వరకూ సయామీ ఖేర్ కి క్రికెట్ ఇంతగా వచ్చని ఎవరికీ తెలీదంటే ఆశ్చర్యం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News