కన్నడ స్టార్ యష్ తన తాజా చిత్రం 'K.G.F' ట్రైలర్ తో భాషాభేదాలు లేకుండా సినిప్రియులందరిని తనవైపు తిప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ సలామ్ రాకీ భాయ్ ను రిలీజ్ చేశారు 'కె.జీ.ఎఫ్' టీమ్.
ఈ పాటకు సాహిత్యం అందించింది రామ జోగయ్య శాస్త్రి. ఈ పాటను విజయ్ ప్రకాష్.. శ్రీ కృష్ణ.. లోకేశ్వర్.. అరుణ్ కౌండిన్య.. ఆదిత్య అయ్యంగార్.. గంటా రితేష్ లు పాడారు. సంగీతం రవి బస్రూర్. పాట హిందీ పదాలతో మొదలై.. స్లోగా తెలుగు లోకి వస్తుంది. "చల్నే కా హుకుం రుక్నేకా హుకుం జిందగీ పే హుకుం మౌత్ మే హుకుం బందూక్ పే హుకుం దుష్మన్ పే హుకుం లేహ్రోం పే హుకుం.. బొంబై పే హుకుం"అంటూ మొదలై సలామ్ రాకీ భాయ్ అని పీక్స్ లోకి వెళుతుంది మ్యూజిక్. ఒక పవర్ఫుల్ టూన్ .. పవర్ఫుల్ లిరిక్స్ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ట్రైలర్ లాగే సాంగ్ కూడా సేన్సేషనే. డౌట్ లేదు.
Full View

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 21 న రిలీజ్ చేస్తున్నారు. కన్నడతో పాటుగా తెలుగు.. తమిళ.. హిందీ.. మలయాళం భాషలలో ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ ను వారాహి చలన చిత్రం విడుదల చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఒక్కసారి పవర్ఫుల్ రాకీ భాయ్ ని చూడండి.