యాక్షన్ లవర్స్ కు 'సలార్‌' వింధు భోజనం

Update: 2021-09-15 12:30 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్‌ స్టార్ అనడంలో సందేహం లేదు. సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న బాహుబలి స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను చేస్తున్నాడు. రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దం అవ్వగా ప్రస్తుతం ఆదిపురుష్ మరియు సలార్‌ లు చాలా స్పీడ్ గా చిత్రీకరణ జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా సమాంతరంగా చిత్రీకరణ సాగుతున్నాయి. ఆదిపురుష్‌ మరియు సలార్ ల కోసం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్రభాస్ కేటాయించాడు. ప్రభాస్‌ సలార్ సినిమాను క్రేజీ డైరెక్టర్‌ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నాడు. ఆయనకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సలార్‌ ను ఆకాశంలో పెట్టి అభిమానులు చూస్తున్నారు.

కేజీఎఫ్‌ లో ఆయన చూపించిన యాక్షన్‌ సన్నివేశాలు బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఆశ్చర్య పర్చాయి. మాస్‌ మాసాలా సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సన్నివేశాల విషయంలో ప్రశాంత్‌ నీల్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన కేజీఎఫ్‌ లో ఏ విధంగా అయితే మాస్ ఎలిమెంట్స్ మరియు యాక్షన్‌ సన్నివేశాలకు జాగ్రత్తలు తీసుకున్నాడో అంతకు మించి అన్నట్లుగా ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలను చేస్తున్నాడట. హాలీవుడ్ టెక్నీషియన్స్ మరియు ఫైటర్స్ ను పిలిపించి మరీ సలార్ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. జాతీయ మీడియాలో సలార్‌ యాక్షన్ సన్నివేశాల గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుందేమో అనిపిస్తుంది.

యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు వెంట్రుకలు నిక్కపొడ్చుకునే సన్నివేశాలు చాలా ఉంటాయని అంటున్నారు. ప్రభాస్ మాస్ లుక్‌.. యాక్షన్‌ సన్నివేశాలు ఆయన్ను పాన్ ఇండియా స్టార్ గా మరో పది మెట్లు ఎక్కించే విధంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా అద్బుతమైన డైలాగ్స్ ను కూడా ప్రభాస్ తో చెప్పించబోతున్నారు. ఓ రియల్‌ పాన్ ఇండియా మూవీగా ఇది నిలుస్తుందని.. బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అందుకోవడం ఖాయం అంటూ ప్రశాంత్ నీల్‌ సన్నిహితులు అంటున్నారు. సలార్‌ సినిమా లో శృతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ మరియు శృతి హాసన్ ల కాంబో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. సినిమా బడ్జెట్‌ లో సగం వరకు యాక్షన్‌ సన్నివేశాలకు ఖర్చు చేస్తున్నారంటే ఏ రేంజ్‌ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ ప్రియులకు వింధు భోజనం మాదిరిగా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయనే నమ్మకం కలుగుతోంది.
Tags:    

Similar News