మెగా స్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లతో సల్మాన్ ఖాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముంబయి వెళ్లిన సమయంలో చరణ్ తప్పనిసరిగా సల్మాన్ ను కలవడం మాత్రమే కాకుండా హైదరాబాద్ కు సల్మాన్ వస్తే మెగా ఫ్యామిలీ వింధు స్వీకరించాల్సిందే. ఈ అనుబంధం మరో లెవల్ కు తీసుకు వెళ్లేలా చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ నటిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు పుకార్లే అని మొదట అనుకున్నా కూడా జరుగుతున్న పరిణామాలు మరియు ఇతర విషయాలను చూస్తుంటే ఖచ్చితంగా మెగాస్టార్ మరియు సల్మాన్ ఖాన్ లు కలిసి కనిపించబోతున్నారు అని మీడియా వర్గాల వారు మరియు సినీ వర్గాల వారు బలంగా చెబుతున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ వచ్చే నెలలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ లో పాల్గొనబోతున్నాడట. కరోనా కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరిలోనే సల్మాన్ షెడ్యూల్ ను పూర్తి చేసేలా డేట్లు తీసుకున్నారట. ఒక వేళ ఫిబ్రవరిలో సాధ్యం కాకుంటే అప్పుడు మార్చిలో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
చిరంజీవి తో ఈ సినిమా ను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. సల్మాన్ ఖాన్ మరియు చిరంజీవిల కాంబోలో వచ్చే సన్నివేశాలు అత్యంత కీలకంగా సినిమాలో ఉంటాయని.. సల్మాన్ కనిపించేది కొద్ది సమయం అయినా కూడా సినిమా కు హైలైట్ అవుతుందని అంటున్నారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు ఇది అఫిషియల్ రీమేక్ అనే విషయం తెల్సిందే. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న లూసీఫర్ ను రీమేక్ చేయాలని చిరంజీవి బలంగా కోరుకున్నాడు. కొన్ని కొన్ని ఇబ్బందులు అవరోదాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని సినిమాను మొదలు పెట్టారు. కరోనా లేకుండా ఉంటే ఇప్పటి వరకు సినిమా పూర్తి అయ్యి విడుదల కూడా చేసేవారు.
కాని కరోనా వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య వచ్చిన రెండు మూడు నెలల్లోనే చిరంజీవి గాడ్ ఫాదర్ ను విడుదల చేయబోతున్నారట. సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్ లో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండబోతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత గాడ్ ఫాదర్ పునః ప్రారంభం అవ్వబోతుంది. ఏకదాటిగా షూటింగ్ చేసిన ముగించే ప్రయత్నాలు చేస్తున్నారు.