గత ఏడాది రేస్ 3 రూపంలో ఈద్ పండక్కి ఊహించని రీతిలో డిజాస్టర్ అందుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈసారి భరత్ గా వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇండియన్ రా ఏజెంట్ గా చాలా విభిన్నమైన పాత్ర చేస్తున్న సల్మాన్ ఈసారి దేశభక్తి అంశాన్ని తీసుకున్నాడు. ఒక వ్యక్తి జీవితంలోని ఐదు దశలను అతను దేశరక్షణ కోసం అంకితమైన తీరును ఇందులో ఆవిష్కరించబోతున్నట్టు తెలిసింది.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుండగా దిశా పటాని సల్మాన్ కు చెల్లిగా మరో కీలక పాత్ర చేస్తోంది. జాకీ శ్రోఫ్ మరో రోల్ లో అలరించనున్నాడు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ ఓ పోస్టర్ ని షేర్ చేసుకుంది .ఎప్పుడు మీసాలు లేకుండా నల్లని జుత్తుతో కండలు తిరిగిన దేహంతో యువకుడిగా కనిపించే సల్మాన్ ఈ లుక్ లో మాత్రం వయో వృద్ధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. బహుశా క్లైమాక్స్ కన్నా ముందు వచ్చే కథలో ఇలా కనిపిస్తాడు కాబోలు.
ఇలా వయసు మళ్ళిన పాత్ర చేయడం బహుశా సల్మాన్ కు ఇదే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు. గెటప్ వేశాడు కానీ పాత్ర పరంగా ఇలా ఏజ్ బార్ రోల్ లో నటించలేదన్న మాట వాస్తవం. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న భరత్ ఈద్ పండగను టార్గెట్ చేసుకుని జూన్ 5న విడుదల కాబోతోంది. టబు-సునీల్ గ్రోవర్-సోనాలి కులకర్ణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు