వివాదం గట్టెక్కేందుకు సల్మాన్ స్కెచ్

Update: 2016-06-24 17:26 GMT
సల్మాన్ ఖాన్ ఈ మధ్య మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్నాడు. దాని నుంచి బయటపడేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే కేంద్ర మహిళా కమిషన్ నుంచి కూడా బహిరంగ క్షమాపణలు కోరాలనే నోటీసు అందుకున్నాడు. మరి ఈ వివాదాన్ని దారి మళ్లించేందుకు సల్లూభాయ్ ఇప్పుడు సూపర్ స్కెచ్ వేశారు. తన పెళ్లి గురించి తనే కామెంట్స్ చేసుకోవడంతో.. ఒక్కసారిగా మీడియా దృష్టంతా సల్మాన్ పెళ్లి వైపు తిరిగిపోయింది.

'పెళ్లి కోసం పడి చస్తున్నా'.. 50 నిండి 51లో ఉన్న బ్రహ్మచారి కండలవీరుడి కామెంట్ ఇది. ఎన్నో ఏళ్లుగా సల్మాన్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న తిరుగుతూనే ఉంది. అలాంటిది ఒక్కసారిగా సల్మాన్ నోటివెంట పెళ్లి కోసం చస్తున్నా అనే మాట రాగానే.. మీడియా అంతా దీన్నే పట్టుకువేళ్లాడుతోంది. 'నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనే అనుకున్నా. కానీ నన్ను యాక్సెప్ట్ చేసే వ్యక్తి దొరకడం కోసమే వెయిట్ చేస్తున్నా' అంటూ మరింత డెప్త్ లోకి కూడా వెళ్లాడు.

ఇక ఎప్పుడైతే అటెన్షన్ అంతా పెళ్లివైపు తిరిగిపోయిందో.. అప్పుడు రెచ్చిపోయిన సల్మాన్.. మహిళలపై తాను చేసిన కామెంట్ కు కాంపెన్సేటింగ్ డైలాగ్స్ కూడా వదిలేశాడు. 'పార్టనర్ ని సెలక్ట్ చేసుకోవడం మగవాళ్లపని కాదని.. అన్నింటినీ డిసైడ్ చేసే మహిళలే ఇది కూడా ఫైనల్ చేయాలి' అంటూ లేడీస్ కే హక్కులు ఇచ్చేస్తూ.. ఆశ్చర్యపరిచాడు. ఇవన్నీ ఓ రియాలిటీ షోకి గెస్ట్ గా వెళ్లి చేసిన కామెంట్స్ కావడంతో.. రేప్ కామెంట్స్ వివాదం నుంచి గట్టెక్కేందుకు సల్మాన్ వేసిన స్కెచ్ ఇది అనే విషయం అర్ధమయిపోతోంది.

Tags:    

Similar News