బాలీవుడ్ క్షణంలో భాయిజాన్!?

Update: 2016-03-16 17:30 GMT
క్షణం మూవీ సంచలనాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మూడో వారంలో కూడా స్క్రీన్ ల సంఖ్య పెంచుకుని విజయవంతంగా దూసుకుపోతున్న ఈ చిత్రానికి, ఇప్పటికే రీమేక్ కు డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ లో క్షణంను రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే దర్శకుడు సాజిద్ నడియడ్వాలా హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని, త్వరలో రీమేక్ సంగతులు ప్రకటించనున్నాడని తెలుస్తోంది.

క్షణం హిందీ రీమేక్ లో లీడ్ రోల్ ను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో చేయించాలన్నది సాజిద్ ఆలోచనగా చెబుతున్నారు. తన మాజీ గాళ్ ఫ్రెండ్ కూతురు కిడ్నాప్ అయితే.. ఆ పాపను కాపాడేందుకు వచ్చే ఎన్నారై పాత్రకు సల్మాన్ సరిగ్గా సరిపోతాడనే టాక్ ఉంది. టాలీవుడ్ లో ఇప్పటికే క్షణంను బ్లాక్ బస్టర్ గా అనౌన్స్ చేసేశారు. కోటి రూపాయల బడ్జెట్, 1.4 కోట్లతో పబ్లిసిటీ.. మొత్తం రెండున్నర కోట్ల లోపే ఖర్చు చేయగా, 5 కోట్లకుపైగా థియేటర్ల నుంచే వసూలు చేసింది క్షణం.

గతంలో రవితేజ మూవీ కిక్ ను కూడా సాజిద్ రీమేక్ రైట్స్ తీసుకుని, సల్మాన్ తో హిందీలో రూపొందించాడు. అక్కడ కూడా కిక్ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇప్పుడు క్షణంతో కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేయాలని ఈ దర్శకుడు భావిస్తున్నాడు. మరోవైపు బజరంగీ భాయ్ జాన్ తర్వాత సల్మాన్ మాస్ చిత్రాలనే కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ని కూడా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. త్వరలో సల్మాన్ క్షణం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News