300 కోట్ల కలక్షన్లు.. 200 మిలియన్ వ్యూస్

Update: 2018-01-11 23:30 GMT
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై మూవీ రికార్డులను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మూడో వారంలో కూడా రాక్ స్టడీగా వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది ఈ చిత్రం. ఇప్పటికే 300 కోట్ల నెట్ వసూళ్లను దాటేసి.. ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది టైగర్ జిందా హై.

ఒకవైపు సల్మాన్ ఖాన్.. మరోవైపు కత్రినా కైఫ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్సైట్ అయిపోయి.. కలెక్షన్స్ వర్షం కురిపించేస్తున్నారు. మరోవైపు అన్ని రకాల రికార్డులను సృష్టించేస్తోన్న సల్లూభాయ్ మూవీ.. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా రికార్డుల దుమ్ము దులిపేస్తోంది. స్వాగ్ గే స్వాగత్ పాట.. ఈ మూవీ ప్రమోషన్స్ కి ఎంతగా హెల్ప్ అయిందో తెలిసిన విషయమే. ఆ పాటకు రికార్డుల కొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడీ పాట అత్యంత వేగంగా 200 మిలియన్లు.. అంటే అక్షరాలా 20 కోట్ల వ్యూస్ సాధించేసింది. అంతే కాదు.. అత్యంత వేగంగా ఇన్ని వ్యూస్ సాధించిన పాటగా కొత్త రికార్డ్ సృష్టించింది స్వాగ్ సాంగ్

ఈ పాటలో సల్మాన్ ఖాన్ స్టెప్పులతో పాటు.. కత్రినా కైఫ్ అందాలను ఆడియన్స్ ను తెగ మత్తెక్కించేశాయి. అందుకే వ్యూయర్స్ ఇప్పటికీ ఈ పాటను ఆన్ లైన్ లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అందమైన లొకేషన్స్.. సూపర్బ్ కొరియోగ్రఫీ.. అదిరిపోయే మ్యూజిక్.. అందాలు ఒలికించే కత్రినా.. అన్నిటికి మించి సల్మాన్ ట్రేడ్ మార్క్ స్టెప్పులు.. ఇన్ని ఉండగా ఇక రికార్డులకు కొదువ ఏముంటుందిలే!
Tags:    

Similar News