ఒక హీరో.. వెయ్యికోట్ల కలెక్షన్లు

Update: 2015-12-31 15:30 GMT
ఓ నాలుగైదేళ్ల కిందట వంద కోట్ల కలెక్షన్లను కూడా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ చూస్తుండగానే ఇండియన్ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్లు నటించే అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా వంద కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేస్తోంది. అందులోనూ సల్మాన్ ఖాన్ అయితే బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది అతను నటించిన రెండు సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి.. 2015 బిగ్గెస్ట్ స్టార్ అతనేనని రుజువు చేశాయి.

వరుసగా మైండ్ లెస్ మాస్ సినిమాలు చేస్తున్నాడన్న అపప్రదను చెరిపివేస్తూ ఈ ఏడాది అతను నటించిన ‘భజరంగి భాయిజాన్’ అన్ని రకాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. సల్మాన్ నుంచి మంచి సినిమా వస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో చూపిస్తూ.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.630 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్టుగా.. ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్లలో రెండో సినిమాగా నిలిచింది.

ఐతే ‘భజరంగి భాయిజాన్’ ఫుల్ పాజిటివ్ టాక్ తో ఆ కలెక్షన్లు సాధిస్తే.. దీపావళికి వచ్చిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ నెగెటివ్ టాక్ తోనూ అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.400 కోట్ల మార్కును అందుకుంది. సల్మాన్-సూరజ్ బర్జాత్యాల కాంబినేషన్ క్రేజ్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. మొత్తానికి బాలేదన్న సినిమాతోనూ 400 కోట్లు కొల్లగొట్టేసి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు సల్మాన్. ఒక్క ఏడాదిలో వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ కథానాయకుడిగా సల్మాన్ చరిత్ర సృష్టించాడీ ఏడాది.
Tags:    

Similar News