భాయ్‌ సెటిల్‌ చేసిన బ్రేకప్‌ గాధ

Update: 2016-03-04 07:30 GMT
హృతిక్‌ రోషన్‌ తన భార్యతో సుజానేతో విడిపోయాడు. అఫీషియల్‌ గా డైవర్స్‌ కూడా వచ్చేసింది. త్వరలోనే ఫర్హాన్‌ అక్తర్‌ అండ్‌ అదునా కూడా కోర్టు నుండి డైవర్స్‌ పొందేలా ఉన్నారు. ఇక సల్మాన్ తమ్మడు అర్బాజ్‌ కూడా ఇదే బాటలో ఉన్నాడని ఎప్పటినుండో రూమర్లు వినబడుతూనే ఉన్నాయి. తన భార్య మలైకా అరోరా ఇప్పటికే వేరే ఫ్లాట్‌ లో వుండటం తో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయ్‌.

అయితే సడన్‌ గా సల్మాన్‌ ఖాన్‌ ఫ్యామిలీ అంతా మొన్న ఒక ముంబయ్‌ రెస్టారెంట్‌ లో తారసపడ్డారు. భాయ్‌ తో పాటు తమ్మడు అర్బాజ్‌ - మరదలు మలైకా.. అలాగే మలైకా చెల్లెలు అమృతా అరోరా.. ఇక భాయ్‌ చెల్లెలు అర్పితా - ఆమె మొగుడు విచ్చేశారు. కేవలం అర్బాజ్‌ అండ్ మలైకా మద్యలో రాజీ కుదర్చడానికే ఈ మీటింగ్‌ అని తెలుస్తోంది. అయితే తన మరదలు అమృతను కౌగిళించుకున్న అర్బాజ్‌.. భార్య మలైకతో మాత్రం ఎందుకో కాస్త డిస్టాన్స్‌ మెయిన్టయిన్‌ చేశాడనే చెప్పాలి. అయినాసరే వీరి బ్రేకప్‌ ను తిరిగి ప్యాచప్‌ చేసి.. దీన్నో వీర గాధగా సెటిల్‌ చేశాడట సల్లూ భాయ్‌.

ఏందో ఈ సెటిల్ మెంట్లు.. మరి తన లైఫ్‌ లో అయిన బ్రేకప్స్‌ విషయంలో కూడా ఇలాగే సెటిల్‌ చేసుకుని ఉంటే ఎంత బాగుండేదో. అయితే ఆ అనుభవాలతోనే ఇప్పుడు బ్రేకప్‌ అయ్యే ప్రేమగాధల క్లయ్‌ మ్యాక్స్‌ ను తిరగరాస్తున్నాడు అంటారా? అదీ నిజమేలే.
Tags:    

Similar News