కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ వచ్చేసింది. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘ట్యూబ్ లైట్’ టీజర్ లాంచ్ చేసేశారు. టీజర్ చూస్తే సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది క్లియర్ గా ఏమీ అర్థం కావడం లేదు. ముందుగా భారత సైనికుల మీద జరిగిన దాడిలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆల్ ఇండియా రేడియో వార్త వినిపిస్తుంది. స్వాతంత్ర్యానికి ముందు నేపథ్యాన్ని చూపించారు ఆ సమయంలో.
ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని నిట్టూర్చాక.. వర్తమానంలోకి వచ్చి హీరోను చూపించారు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా కనిపిస్తున్నాడు సల్మాన్ ఇందులో. ‘భజరంగి భాయిజాన్’కు కొనసాగింపులా ఉంది సల్మాన్ క్యారెక్టర్. ఇందులో మరీ బుర్ర ఎదగని వాడిలా కనిపిస్తున్నాడు. హీరోను పరిచయం చేస్తూ అతడి వాయిస్ తోనే ‘ట్యూబ్ లైట్’కు.. నమ్మకానికి ఓ ఆసక్తికర పోలిక చెప్పారు.
ట్యూబ్ లైట్ వెలగడానికి టైం తీసుకుంటుందని.. కానీ ఒకసారి వెలిగాక చుట్టూ ఉన్న అందరికీ వెలుగునిస్తుందని.. నమ్మకం కూడా ఇలాంటిదే అని అన్నారు. మామూలుగా ‘ట్యూబ్ లైట్’ అనే పదాన్ని నెగెటివ్ కోణంలో వాడతారు. ట్యూబ్ లైట్ వెలగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి.. ఏదైనా విషయం వెంటనే గ్రహించలేని వాళ్లను ‘ట్యూబ్ లైట్’ అంటుంటారు. ఐతే ‘ట్యూబ్ లైట్’ సినిమాలో దీనికి కొత్త అర్థం చెబుతున్నట్లున్నారు. సల్మాన్ తో ‘భజరంగి భాయిజాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చైనా అమ్మాయి జు జు కథానాయికగా నటించిన ఈ చిత్రం రంజాన్ కానుకగా విడుదలవుతుంది.
Full View