'బాడీగార్డ్'లకు కండిషన్స్!!

Update: 2017-06-15 10:07 GMT
బాడీగార్డ్ అంటూ సల్మాన్ ఖాన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పేరుతో మంచి లవ్ స్టోరీ తీసి సక్సెస్ కొట్టాడు కానీ.. ఇప్పుడు తన బాడీగార్డులకు కూడా రూల్స్ పెట్టేస్తున్నాడట. బాలీవుడ్ కండలవీరుడి ఫిట్నెస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.

50ప్లస్ ఏజ్ లో కూడా ఇప్పటికీ యంగ్ హీరోలకు కాంపిటీషన్ వచ్చేసే సల్మాన్ ఖాన్.. ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాడు. సిక్స్ ప్యాక్ లు చూపించడం.. బాడీని ఎక్స్ పోజ్ చేయడం లాంటివన్నీ ఈ స్టార్ హీరోకు కామన్. ఇప్పుడు తన దగ్గర పని చేసే బాడీగార్డులకు కూడా హెల్త్.. ఫిట్నెస్ విషయంలో కండిషన్స్ పెట్టాడట సల్మాన్. తన బౌన్సర్స్ కోసం ఓ డైట్ ఛార్ట్ ప్రిపేర్ చేసిన సల్లూభాయ్.. వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సిందే అని చెప్పాడట. లేకపోతే జాబ్ లోంచి తీసేస్తానని కూడా ఖరాఖండీగా తేల్చేశాడట సల్మాన్.

నిజానికి సల్మాన్ టీంలో చాలా ఫిట్ గా ఉండే బౌన్సర్స్ ఉంటారు. కానీ గత కొన్నిసార్లుగా జన సమ్మర్దంలో ఉన్నపుడు జనాలను అడ్డుకోలేకపోవడం గమనించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. తన ఫ్యామిలీ గురించి అత్యంత జాగ్రత్తలు తీసుకునే సల్మాన్.. వారి క్షేమం కోసం బాడీగార్డుల ఫిట్ నెస్ పై ఎలర్ట్ గా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News