ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏ మాత్రం అందం తగ్గని బ్యూటీల్లో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఒకరు. ఇటీవల కాలంలో ఆమె వార్తల్లో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. తాజాగా ఒక షోలో పాల్గొన్న ఆమె తీరు ఇప్పుడు వార్తగా మారింది. సల్మాన్.. కత్రినాలు కలిసి నటించిన తాజా చిత్రం టైగర్ జిందాహై. ఈ నెలాఖరులో.. క్రిస్మస్‌కు ముందు ప్రేక్షకుల తీర్పు కోసం రానుంది.
ఈ చిత్ర ప్రచారాన్ని ఈ మధ్యన మొదలెట్టారు. ప్రముఖ టీవీ షోలకు వెళ్లటం.. సినిమాను ప్రమోట్ చేయటం ఒక సంప్రదాయంగా మారిన నేపథ్యంలో.. డ్యాన్స్ ఛాంపియన్స్ రియాల్టీ షోకు వెళ్లారు. ఈ షోలో పాల్గొన్న ఒక జట్టు సల్మాన్ నటించిన తేరా నామ్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. వారు చేసిన డ్యాన్స్ చూసి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు కత్రినా. ఊహించని రీతిలో కత్రినా రియాక్ట్ కావటంతో షో నిర్వాహకులు కాసేపు షో షూట్‌ను నిలిపివేశారు.
అనంతరం.. కత్రినాను నవ్వించేందుకు కండల వీరుడు సల్మాన్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తాను నటించిన సుల్తాన్ చిత్రంలో జగ్ ఘూమోయో అనే పాటకు డ్యాన్స్ చేయటంతో పాటు.. మైనే ప్యార్ కియా సినిమాలోని దిల్ దీవానా పాటకు డ్యాన్స్ వేయటంతో కత్రినా ఒక్కసారి నవ్వేశారు. దీంతో.. వాతావరణం కూల్ అయిపోయింది. కత్రినా నవ్వు కోసం సల్మాన్ పడిన కష్టం చూసి అక్కడి వారు ఈలలు.. చప్పట్లు కొట్టారు.