వావ్ సమంత.. బయటకొచ్చిన కొత్త కోణం

Update: 2021-05-20 05:30 GMT
మాటలు చెప్పటం వేరు.. చేతల్లో చూపించటం వేరు. కష్టం వచ్చినప్పుడు తామున్నామన్న విషయాన్ని చాటి చెప్పేలా చర్యలు తీసుకోవటం చాలా అవసరం. కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. తాను నడిపే ఎన్జీవోల ద్వారా కొత్త సేవా కార్యక్రమాలకు తెర తీశారు సినీ నటి సమంత.

ఆమె నడిపే ప్రత్యూష ఫౌండేషన్.. దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి పది ఆక్సిజన్ కాన్సనేట్రేటర్లు అందజేసిన వైనం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. హైదరాబాద్ తో పోలిస్తే.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటివేళ.. తనకు తోచిన సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన సమంత స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పక తప్పదు.

ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను అందించటం ద్వారా అత్యవసర సమయాల్లో కొవిడ్ రోగులకు సాయం చేయటమే కాదు.. ప్రాణాధారంగా మారతాయి. సామ్ బాటలో మిగిలిన టాలీవుడ్ స్టార్లు కూడా తలో చేయి వేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. తాను చేసిన సాయానికి సంబంధించి ప్రచారం లేకుండా చూసుకునే సమంత ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నారని చెప్పాలి.




Tags:    

Similar News