‘బ్రహ్మోత్సవం’ విడుదలకు ఇంకో ఆరు రోజులే మిగిలుంది. ఈలోపు ఈ సినిమా గురించి.. ఇందులోని పాత్రలు.. సన్నివేశాల గురించి.. ఒక్కొక్కరు చెబుతున్న తీరు చూస్తుంటే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కాజల్ ఈ సినిమా గురించి ఓ రేంజిలో చెప్పింది. సమంత సైతం అలాగే మాట్లాడుతోంది. ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాల్ని ప్రేక్షకులు చూడబోతున్నారని.. రేవతి కాంబినేషన్లో తాను చేసిన ఓ సన్నివేశాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని.. ప్రేక్షకులకు కూడా ఆ సన్నివేశం గొప్ప అనుభూతిని పంచుతుందని ఆమె చెప్పింది.
‘‘మనిషి ఆలోచనల్ని.. భావోద్వేగాల్ని సరిగ్గా పట్టుకోవడంలో శ్రీకాంత్ అడ్డాల మాస్టరేమో అనిపిస్తూంటుంది. ఈ సినిమాలో రేవతి గారికి.. నాకు మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. నేను ఆ సీన్లో ప్రత్యేకంగా నటించాల్సిన అవసరమే రాలేదు. ఆ సన్నివేశమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది. రేప్పొద్దున ప్రేక్షకులు కూడా ఆ సన్నివేశంతో బాగా కనెక్టవుతారు. సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. శ్రీకాంత్ అడ్డాల బ్రాండ్ మార్క్ సినిమా బ్రహ్మోత్సవం అని కచ్చితంగా చెప్పగలను’’ అని సమంత చెప్పింది.
‘బ్రహ్మోత్సవం’లో ఇంకో ఇద్దరు హీరోయిన్లతో కలిసి స్క్రీన్ పంచుకోవడం గురించి సమంత చెబుతూ... ‘‘నాకు అలాంటి ఫీలింగేమీ లేదు. బ్రహ్మోత్సవం అనేది ఓ పెద్ద కథ. ఇలాంటి కథలో మేమంతా పాత్రలమే. కథే ఈ సినిమాకు స్టార్. ప్రతి పాత్రకూ ఓ ప్రాధ్యాన్యత ఉన్నపుడు ఎంతమంది హీరోయిన్లున్నా ఇబ్బంది లేదు. నిజానికి ఈ సినిమాలో నాకు మహేష్-కాజల్ మీద తీసిన బాలా త్రిపురమణి అనే పాటంటే పిచ్చి ఇష్టం. ఆ పాట విజువల్స్ కూడా చూశా. అది నా పాట కాదని పొగడకుండా ఉండలేం కదా’’ అని సమంత చెప్పింది.