అక్కినేని కోడలు సమంతపై ఊహించని ఒత్తిడి పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సామ్ సినిమాలు తగ్గించుకున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్ గా మాత్రమే నటిస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ లు.. టీవీ షోలు అంటూ కెరీర్ పరంగా సరికొత్త ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఇటీవల జాను ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. మరో రెండు మూడేళ్ల పాటు మాత్రమే నటిస్తానని ప్రకటించి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే సమంత వరుస సక్సెస్ లతో జోరు మీద ఉండీ.. ఉన్నట్టుండి ఇలా మారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే ఇంట్లో ఇప్పటికే పిల్లల్ని కనాల్సిందిగా ఒత్తిడి పెరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. బయట అభిమానుల నుంచి పదే పదే ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఇటీవలే రిలీజైన జాను చిత్రాన్ని అంగీకరించేందుకే సమంత చాలా ఆలోచించుకున్నానని తెలిపింది. పెళ్లి తర్వాత షెడ్యూల్స్ కఠినంగా మారడం తో ఆలోచన మారిందిట.
తాజాగా రిలీజైన `జాను` పెద్ద విజయం సాధించాలని తిరుమల తిరుపతి వెంకటేశునికి సమంత మొక్కింది. ఈ సందర్భం గా చిత్రబృందం వెంకటేశుని కొలువులో కనిపించారు. అయితే అక్కడ దైవదర్శనం ముగించుకుని తిరిగి వెళుతున్న సమంతకు ఓ అభిమాని నుంచి ఊహించని విధంగా ప్రశ్న ఎదురైంది. గుంపుగా అభిమానులంతా సమంతకు అభివాదం చేస్తుంటే అందులోని ఒక అభిమాని ఓవర్ ఎగ్జయిట్ అయ్యి.. ``అక్కా అబ్బాయో అమ్మాయో పుట్టాలి అక్కా`` అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. దానికి సామ్ నవ్వుతో సరిపెట్టేసింది. నిజానికి కెరీర్ పరంగా ఉన్న బిజీ షెడ్యూల్స్ ఫ్యామిలీ లైఫ్ కి ఆటంకమే. అలాంటి వాళ్లు ఇలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తనకు 30 ఏజ్ వచ్చేస్తే ఇక పూర్తిగా కుటుంబానికే అంకితమవుతానని సమంత చెబుతోంది. అందుకే ఇప్పటి వరకూ కొన్నిటిని వాయిదా వేసేందుకు కంట్రోల్ చేసేస్తోందని భావించాల్సి ఉంటుంది.